
మహబూబాబాద్ : దేశవ్యాప్తంగా కరోనా కేసులు మళ్లీ పెరుగుతూ ఆందోళన కలిగిస్తున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే తెలంగాణలోని మహబూబాబాద్ జిల్లా కేంద్రంలో ఉన్న ఓ గిరిజన సంక్షేమ గురుకుల పాఠశాలలో 15 మంది విద్యార్థులకు కరోనా సోకింది. ఈ గురుకుల పాఠశాలకు చెందిన విద్యార్థులకు పరీక్షల నిర్వహించగా అందులో 15 మంది విద్యార్థులకు కోవిడ్ 19 పాజిటివ్ గా తేలింది. ఈ విషయం ఆలస్యంగా చూసింది. ఈ మధ్యకాలంలో తమ ఊరికి వెళ్లి వచ్చిన ఒక ముగ్గురు విద్యార్థులు దగ్గు, జ్వరంతో బాధపడుతున్నారు.
ఈ గురుకుల పాఠశాలలో ఉన్న స్టాఫ్ నర్స్ వారిని గమనించి స్థానిక జిల్లా ఆసుపత్రికి ఈ నెల నాలుగవ తేదీన తీసుకెళ్లారు. వారిని పరీక్షించిన వైద్యులు ఆర్టిపిసిఆర్ పరీక్ష నిర్వహించాలని తెలిపారు. అక్కడే ఆ ముగ్గురికి ఆర్టిపిసిఆర్ పరీక్షలు నిర్వహించగా.. ముగ్గురిలో ఇద్దరికి పాజిటివ్ గా మరొకరికి నెగిటివ్ గా రిపోర్టులు వచ్చాయి. ఈ రిపోర్టులు బుధవారం వచ్చాయి. కాగా, కరోనా అని తెలియక పాజిటివ్ గా వచ్చిన వారితో కలిసి తిరిగిన 48 మందికి కూడా ఆ తరువాత ఆర్టీసీఆర్ పరీక్షలు నిర్వహించారు.
బండి సంజయ్‌కు బెయిల్ మంజూరు.. రేపు ఉదయం జైలు నుంచి బయటకు!
ఈ పరీక్షల్లో మరో 13మందికి కరోనా నిర్ధారణ అయినట్టుగా తేలింది. ముందు ముగ్గురు విద్యార్థుల పరీక్షల ఫలితాలు బుధవారం నాడు వెలుగు చూడగా… గురువారం నాడు మిగతా 13 మందికి పాజిటివ్ గా తేలింది. పాజిటివ్ గా తేలిన ఈ 15మంది విద్యార్థులకు సంబంధించిన సమాచారం వారి తల్లిదండ్రులకు అందించి.. వారిని వారి వారి తల్లిదండ్రులతో ఇంటికి పంపించినట్లుగా రీజినల్ కోఆర్డినేటర్ రాజ్యలక్ష్మి తెలిపారు.
పాఠశాలలోని ఓ గదిలో మిగిలిన విద్యార్థులను అందరిని ప్రత్యేకంగా, సురక్షితంగా ఉంచారు. తల్లిదండ్రులు వీరి విషయంలో ఆందోళన చెందొద్దని తెలిపారు. కాగా గురుకుల పాఠశాల వాచ్మెన్ కు కూడా కరోనా పాజిటివ్ గా తేలినట్టుగా సమాచారం. కానీ ఈ విషయాన్ని రీజనల్ కోఆర్డినేటర్ రాజ్యలక్ష్మి నిర్ధారించలేదు..