తెలంగాణ బీజేపీ చీఫ్ మార్పంటూ ప్రచారం.. బండి సంజయ్ స్పందన ఇదే

Siva Kodati |  
Published : Dec 07, 2022, 05:48 PM IST
తెలంగాణ బీజేపీ చీఫ్ మార్పంటూ ప్రచారం.. బండి సంజయ్ స్పందన ఇదే

సారాంశం

తెలంగాణ బీజేపీ అధ్యక్షుడిని కమలనాథులు మార్చబోతున్నారంటూ జరుగుతోన్న ప్రచారంపై ఎంపీ బండి సంజయ్ స్పందించారు. హైకమాండ్ ఏ నిర్ణయం తీసుకున్నా కట్టుబడి వున్నానని స్పష్టం చేశారు.

తెలంగాణ బీజేపీ చీఫ్ బండి సంజయ్‌ని హైకమాండ్ మార్చబోతోందని జరుగుతున్న ప్రచారంపై బండి సంజయ్ స్పందించారు. హైకమాండ్ ఏ నిర్ణయం తీసుకున్నా కట్టుబడి వున్నానని స్పష్టం చేశారు. బీజేపీలో టికెట్ల కేటాయింపులో ఎవరు హామీ ఇచ్చినా కుదరదని.. ఇది ఏక్ నిరంజన్ పార్టీ కాదని బండి సంజయ్ వ్యాఖ్యానించారు. కేసీఆర్ బిడ్డ సారా దందాకు దేశమంతా సిగ్గుపడుతోందన్నారు. ఖానాపూర్ గడ్డపై బీజేపీ జెండా ఎగురవేస్తామని .. హిందువుల సహనాన్ని పిరికితనం అనుకుంటే ఊరుకోమని సంజయ్ హెచ్చరించారు. 

ALso REad:నేను పొగాకు నములుతానా.. కేటీఆరే డ్రగ్స్‌కు బానిస, ఏ టెస్ట్‌కైనా రెడీ : బండి సంజయ్ సవాల్

టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్‌పై సంచలన వ్యాఖ్యలు చేశారు బండి సంజయ్. తనకు పొగాకు నమిలే అలవాటు వుందంటూ చేసిన వ్యాఖ్యలకు సంజయ్ కౌంటరిచ్చారు. కేటీఆర్‌కు డ్రగ్స్ సేవించే అలవాటు వుందని, దమ్ముంటే పరీక్షలు చేయించుకోవాలని ఆయన సవాల్ విసిరారు. ఈ మేరకు ఆయన బుధవారం ట్వీట్ చేశారు. ఈ ట్విట్టర్ టిల్లు తాను పొగాకు నములుతానని అంటున్నాడని.. ఇది అబద్ధమన్నారు. కేటీఆర్ డ్రగ్స్‌కు బానిస అని సంజయ్ ఆరోపించారు. తాను తన శరీరంలో రక్తం సహా ఏ శాంపిల్‌ అయినా టెస్టుల కోసం ఇవ్వడానికి సిద్ధమని ఆయన ప్రకటించారు. మరి తనలాగే కేటీఆర్ కూడా పరీక్షలకు సిద్ధమా అని బండి సంజయ్ సవాల్ విసిరారు. అంతేకాకుండా హైదరాబాద్, బెంగళూరు డ్రగ్స్ కేసులను మరోసారి తిరగతోడాలని ఆయన డిమాండ్ చేశారు. 
 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

IRCTC Jyotirlinga Tour Package: ఒక్క టికెట్‌తో ఏడు జ్యోతిర్లింగాల దర్శనం.. ఐఆర్‌సీటీసీ బంపర్ ఆఫర్ !
Rain Alert: రుతుపవనాల రాకపై ఐఎండీ అప్‌డేట్.. ఏపీ, తెలంగాణకు వానలు వచ్చేది అప్పుడేనా?