భారత రాజకీయాలను తెలంగాణ ప్రభావితం చేయాలి: జగిత్యాల సభలో కేసీఆర్

By narsimha lode  |  First Published Dec 7, 2022, 4:49 PM IST

తాను బతికున్నంత కాలం రైతు బంధు, రైతు భీమా కొనసాగుతుందని  తెలంగాణ సీఎం కేసీఆర్ చెప్పారు. కేంద్ర ప్రభుత్వ విధానాలను కేసీఆర్ తూర్పారబట్టారు.


జగిత్యాల:  భారత రాజకీయాలను తెలంగాణ ప్రభావితం  చేయాల్సిన అవసరం ఉందని  తెలంగాణ సీఎం కేసీఆర్  చెప్పారు.బుధవారంనాడు జగిత్యాలలో నిర్వహించిన టీఆర్ఎస్ సభలో తెలంగాణ సీఎం కేసీఆర్  ప్రసంగించారు. తెలంగాణ తాను సీఎంగా, కేంద్రంలో మోడీ ప్రధానిగా ఒకేసారి బాద్యతలు చేపట్టినట్టుగా ఆయన గుర్తు చేశారు. మోడీ హయంలో ఒక్క మంచి పనైనా జరిగిందా అని ఆయన ప్రశ్నించారు. దీపావళి  టపాసులు , జాతీయ జెండా చైనా నుండి తెచ్చుకోవడమేనా మేకిన్ ఇండియా ఉద్దేశ్యమా అని  ఆయన మోడీని ప్రశ్నించారు.

మోడీ సర్కార్ ప్రభుత్వరంగ సంస్థలను విక్రయిస్తుందన్నారు.  రైతులకు ఉచిత పథకాలు వద్దని మోడీ సర్కార్ చెబుతుందన్నారు. కానీ  ఎన్‌పీఏల పేరిట రూ. 14 లక్షల కోట్ల ప్రజా ధనాన్ని కార్పోరేట్ సంస్థలకు బీజేపీ  సర్కార్ దోచి పెట్టిందని కేసీఆర్ విమర్శించారు. అంతేకాదు రూ.35 లక్షల కోట్ల ఆస్తులున్న ఎల్ఐసీని కూడా విక్రయించేందుకు  మోడీ సర్కార్ ప్రయత్నిస్తుందన్నారు. దీనికి వ్యతిరేకంగా అందరం పిడికిలి బిగించి పోరాటం చేయాల్సిన అవసరం ఉందన్నారు. 

Latest Videos

undefined

దేశంలో  వందల పరిశ్రమలు మూతపడ్డాయని సీఎం కేసీఆర్ చెప్పారు.50 లక్షల మంది కార్మికులు  ఉపాధి పోయిందన్నారు.  ఈ విషయమై తాను  ఎక్కడైనా  చర్చకు సిద్దంగా  ఉన్నానని కేసీఆర్  చెప్పారు. మేకిన్ ఇండియా అమలు చేస్తే  ఊరూరా చైనా బజార్లు ఎలా వచ్చాయని  కేసీఆర్  ప్రశ్నించారు. తెలంగాణ జీడీపీ 5 లక్షల నుండి  11లక్షలకు చేరిందన్నారు. కేంద్ర ప్రభుత్వం చేతకానితనం వల్ల తెలంగాణ రాష్ట్రం  సుమారు  మూడున్నర లక్షల జీఎస్‌డీపీ నష్టపోయిందని  కేసీఆర్ చెప్పారు.ఇదే పరిస్థితి కొనసాగితే దేశం  100 ఏళ్లు వెనుకబడే ప్రమాదం ఉందన్నారు. 

also read:అద్భుత విజయాలు సాధిస్తున్నాం: జగిత్యాలలో కొత్త కలెక్టరేట్‌ను ప్రారంభించిన కేసీఆర్

ఈ విషయాలపై ప్రజలు  గ్రామాల్లో చర్చించాలని  కేసీఆర్ కోరారు.  మనచుట్టూ ఏం జరుగుతుందో  తెలుసుకోవాల్సిన అవసరం ఉందన్నారు.గోల్ మాల్ గోవిందం చేసేవాళ్లు, కారు కూతలు కూసేవాళ్లు మన మధ్య తిరుగుతున్నారన్నారు. ఇలాంటి వారి పట్ల జాగ్రత్తగా ఉండాని కేసీఆర్ ప్రజలను కోరారు.   

తాను ఉన్నంత వరకు రైతు బంధు, రైతు భీమా ఆగదని తెలంగాణ సీఎం కేసీఆర్ హామీ ఇచ్చారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైనందునే జగిత్యాల జిల్లా ఏర్పడిందన్నారు సీఎం కేసీఆర్.తెలంగాణలో అద్భుత పుణ్యక్షేత్రాలున్నాయన్నారు.కొండగట్టు అంజన్న ఆలయ అభివృద్దికి  రూ. 100 కోట్లు మంజూరు చేసినట్టుగా కేసీఆర్ తెలిపారు.దేశమంతా ఆశ్చర్యపడేలా ఈ ఆలయాన్ని నిర్మిస్తామని కేసీఆర్ చెప్పారు. బండలింగాపూర్ ను మండల కేంద్రంగా ఏర్పాటు చేస్తున్నట్టుగా కేసీఆర్ ప్రకటించారు.

వరద కాలువపై ఇప్పటికీ  13 వేల మోటార్లున్నాయన్నారు.ఈ మోటార్లకు  సుమారు రూ. 14 వేల విద్యుత్ బిల్లులను  ప్రభుత్వమే చెల్లిస్తున్న విషయాన్ని సీఎం కేసీఆర్ గుర్తు చేశారు.
ఈ మోటార్లకు మీటర్లు పెట్టాలని  కేంద్రం కోరుతుందన్నారు. మోటార్లకు మీటర్ల పెట్టాలా అని ప్రజలను కోరారు.  మద్దుట్ల వద్ద లిఫ్ట్ ఇరిగేషన్ ఏర్పాటు చేస్తామని ఆయన  ప్రజలకు కేసీఆర్ హామీ ఇచ్చారు.దేశంలో ఏ రాష్ట్రంలో కూడా రైతులు పండించిన ధాన్యం కొనడం లేదన్నారు. కానీ రైతుల బాగు కోసం  తమ ప్రభుత్వం  రైతుల నుండి ధాన్యం సేకరిస్తుందన్నారు.  రాష్ట్రంలో ఇంకా  అనేక పనులు చేయాల్సిన అవసరం ఉందని చెప్పారు.  
 

click me!