తెలంగాణ బిజెపి అధ్యక్ష మార్పుపై జోరుగా ప్రచారం... క్లారిటీ ఇచ్చిన బండి సంజయ్

Published : Jun 11, 2023, 08:46 AM IST
తెలంగాణ బిజెపి అధ్యక్ష మార్పుపై జోరుగా ప్రచారం... క్లారిటీ ఇచ్చిన బండి సంజయ్

సారాంశం

తెలంగాణ బిజెపి అధ్యక్ష మార్పుపై రాజకీయ వర్గాల్లోనే కాదు ప్రజల్లోనూ జోరుగా సాగుతున్న ప్రచారంపై బండి సంజయ్ స్పందించారు. 

హైదరాబాద్ : కర్ణాటక ఎన్నికల తర్వాత తెలంగాణలో బిజెపి జోష్ తగ్గి కాంగ్రెస్ జోరు పెరిగిన విషయం తెలిసిందే. ఎన్నికలకు ముందు ఇలా బిజెపి డీలా పడటంపై అదిష్టానం దృష్టిసారించిందని... ఈ క్రమంలోనే రాష్ట్ర అధ్యక్ష మార్పుపై నిర్ణయం తీసుకుందనే ప్రచారం పొలిటికల్ సర్కిల్ లో సాగుతోంది. ప్రస్తుత అధ్యక్షుడు బండి సంజయ్ ను తొలగించి మాజీ మంత్రులు ఈటల రాజేందర్ లేదా డికె అరుణకు రాష్ట్ర బాధ్యతలు అప్పగించేందుకు బిజెపి పెద్దలు సిద్దమయ్యారనే ప్రచారం జరుగుతోంది. దీంతో అసలు పార్టీలో ఏం జరుగుతుందో అర్థం కాక నాయకులు, కార్యకర్తల్లో గందరగోళం నెలకొంది. ఈ నేపథ్యంలో అధ్యక్ష మార్పు ప్రచారంపై బండి సంజయ్ క్లారిటీ ఇచ్చారు.  

తెలంగాణ బిజెపి అధ్యక్షున్ని మార్చనున్నారంటూ జరుగుతున్నదంతా తప్పుడు ప్రచారమని సంజయ్ స్పష్టం చేసారు. ఇతర పార్టీలు చేసే ఈ ప్రచారాన్ని బిజెపి క్యాడర్ నమ్మవద్దని సూచించారు. ఏదయినా వుంటే బిజెపి పెద్దలే స్వయంగా ప్రకటిస్తారని అన్నారు. పార్టీ లైన్ లోనే వుంటూ బిజెపి బలోపేతానికి పనిచేస్తున్నానని... పార్టీ జాతీయాధ్యక్షుడి ఆదేశాలకు కట్టుబడి పనిచేస్తామని బండి సంజయ్ పేర్కొన్నారు. 

తనను రాష్ట్ర అధ్యక్ష పదవినుండి తొలగించి కేంద్ర మంత్రిని చేస్తారంటూ ప్రచారం జరుగుతోందని బండి సంజయ్ అన్నారు. బిజెపిని బలహీనపర్చేందుకు జరుగుతున్న కుట్రల్లో భాగమే ఈ ప్రచారమని అన్నారు. బిజెపి అధిష్టానం తీసుకున్న నిర్ణయాలు ముందుగానే లీకయ్యే అవకాశాలు వుండవని... గతంలో ఎప్పుడూ ఇలా జరిగిన దాఖలాలు లేవన్నారు. కాబట్టి ఇప్పుడు కూడా బిజెపి నుండి లీకులు లేవని సంజయ్ అన్నారు. 

Read More  బీజేపీ రాష్ట్ర నాయకత్వంలో మార్పులు.. డీకే అరుణకు అధ్యక్షపగ్గాలు!.. ఎన్నికల స్టీరింగ్‌ కమిటీ చైర్మన్‌ గా ఈటెల?

ఇక డిల్లీ లిక్కర్ స్కామ్ లో ముఖ్యమంత్రి కేసీఆర్ కూతురు, బిఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ప్రమేయంపై ఈడీ, సిబిఐ విచారణ కొనసాగుతోందని సంజయ్ పేర్కొన్నారు. కేంద్ర దర్యాప్తు సంస్థలు లిక్కర్ స్కామ్ ఆధారాలను సేకరిస్తున్నాయని... దొంగలు ఎవరైనా మోదీ ప్రభుత్వం వదిలిపెట్టబోదని అన్నారు. తప్పుచేసిన వారు కాస్త ఆలస్యమైనా జైలుకు వెళ్లడం ఖాయమని సంజయ్ కీలక వ్యాఖ్యలు చేసారు.

సిబిఐ, ఈడీకి బిజెపితో ఎలాంటి సంబంధాలు లేవు... అవి స్వతంత్రంగానే పనిచేస్తాయని సంజయ్ అన్నారు.ఈ దర్యాప్తు సంస్థలు డిల్లీ లిక్కర్ స్కామ్ పై విచారణ సాగిస్తున్నాయని... అది పూర్తికాకముందే అరెస్ట్ చేయాలంటే ఎలాగని అన్నారు. సమయం వచ్చినపుడు తప్పుచేసిన వారు ఏ స్థాయిలో వున్న శిక్ష తప్పదని బండి సంజయ్ అన్నారు. 

ఇక తెలంగాణలో టీడీపీ, బీజేపీకి మధ్య పొత్తు కుదిరిందని జరుగుతున్న ప్రచారంపైనా సంజయ్ స్పందించారు. టిడిపితో ఎలాంటి పొత్తు లేదని సంజయ్ స్పష్టం చేసారు. రానున్న ఎన్నికల్లో బిజెపి ఒంటరిగానే పోటీ చేస్తుందని సంజయ్ తెలిపారు. 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

చైనీస్ మాంజాపై సజ్జనార్ కొరడా | Sajjanar Strong Warning on Chinese Manja Sales | Asianet News Telugu
Invite KCR To Medaram Jatara: కేసీఆర్ కు మేడారం ఆహ్వాన పత్రిక అందజేసిన మంత్రులు| Asianet News Telugu