బీజేపీని అధికారంలో తీసుకొచ్చేందుకు కృషి చేస్తారని ఆశిస్తున్నా.. కిషన్ రెడ్డి, ఈటలకు బండి శుభాకాంక్షలు

Published : Jul 05, 2023, 10:10 AM IST
బీజేపీని అధికారంలో తీసుకొచ్చేందుకు కృషి చేస్తారని ఆశిస్తున్నా.. కిషన్ రెడ్డి, ఈటలకు బండి శుభాకాంక్షలు

సారాంశం

తెలంగాణ బీజేపీ అధ్యక్షుడిగా నియమితులైన కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, ఎన్నికల నిర్వహణ కమిటీ చైర్మన్‌గా నియమితులైన హుజూరాబాద్ ఎమ్మెల్యే ఈటల రాజేందర్‌లకు ఎంపీ బండి సంజయ్ శుభాకాంక్షలు తెలిపారు.

తెలంగాణ బీజేపీ అధ్యక్షుడిగా నియమితులైన కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, ఎన్నికల నిర్వహణ కమిటీ చైర్మన్‌గా నియమితులైన హుజూరాబాద్ ఎమ్మెల్యే ఈటల రాజేందర్‌లకు ఎంపీ బండి సంజయ్ శుభాకాంక్షలు తెలిపారు. ఈ మేరకు బండి సంజయ్ ట్విట్టర్‌లో పోస్టు చేశారు. అనుభవజ్ఞులైన, సమర్థులైన కిషన్ రెడ్డి, ఈటల రాజేందర్ నాయకత్వంలో పార్టీ మరింత బలోపేతం అవుతుందని భావిస్తున్నట్టుగా తెలిపారు. అలాగే తెలంగాణలో బిజెపిని అధికారంలోకి తీసుకురావడానికి వారు కృషి చేస్తారని ఆశిస్తున్నట్టుగా బండి సంజయ్ పేర్కొన్నారు. 

తెలంగాణ బీజేపీలో నెలకొన్ని పరిణామాల నేపథ్యంలో.. పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిగా బండి సంజయ్ స్థానంలో కిషన్ రెడ్డిని నియమిస్తూ ఆ పార్టీ అధిష్టానం నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే. ఈ మేరకు బీజేపీ అధిష్టానం మంగళవారం ఉత్తర్వులు కూడా జారీ చేసింది. ఈ క్రమంలోనే ట్విట్టర్ వేదికగా స్పందించిన బండి సంజయ్.. తనలాంటి సాధారణ కార్యకర్తకు పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిగా పనిచేసే గొప్ప అవకాశం ఇచ్చినందుకు ప్రధాని మోదీ, కేంద్ర హోం మంత్రి అమిత్ షా, బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాలతో పటు పలువురు ముఖ్య నేతలకు ధన్యవవాదాలు తెలిపారు. అంచనాలకు అనుగుణంగానే పనిచేశానని భావిస్తున్నానని ఆయన పేర్కొన్నారు. 

‘‘నేను రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్న సమయంలో అందించిన మద్దతు, ప్రేమ, ప్రోత్సాహానికి నాయకులు, కార్యకర్తలు, అన్ని మోర్చాల నాయకులు, సభ్యులకు, సంగ్రామ సేన, రాష్ట్ర పార్టీ కార్యాలయ ఉద్యోగులు, సోషల్ మీడియా యోధులు, ఎలక్ట్రానిక్, ప్రింట్ మీడియాకు ప్రత్యేక ధన్యవాదాలు. ప్రజా సంగ్రామ యాత్రలో అడుగడుగునా నన్ను ముక్తకంఠంతో స్వాగతించిన తెలంగాణ ప్రజలకు కృతజ్ఞతలు. ఈ రోజు నన్ను ఇలా తీర్చిదిద్దిన కరీంనగర్ ఓటర్లకు, కార్యకర్తలకు ఎల్లప్పుడూ రుణపడి ఉంటాను. కిషన్ రెడ్డి సమర్థ నాయకత్వంలో నేను కొత్త ఉత్సాహంతో పార్టీ కోసం పని చేయడానికి ఎదురుచూస్తున్నాను’’ అని బండి సంజయ్ అన్నారు. 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

Top 10 Police Stations : ఇండియాలో టాప్ పోలీస్టేషన్లు ఇవే.. తెలుగు రాష్ట్రాల నుండి ఒకేఒక్క స్టేషన్
Complaint Against YouTuber Anvesh: యూట్యూబర్ అన్వేష్ పై కరాటే కళ్యాణి ఫిర్యాదు| Asianet News Telugu