బెయిల్ రద్దు చేయాలి: బండి సంజయ్ పై హైకోర్టులో ఏజీ

By narsimha lode  |  First Published Apr 10, 2023, 4:45 PM IST

తన  రిమాండ్ ను రద్దు చేయాలని  కోరుతూ  బండి  సంజయ్ దాఖలు చేసిన పిటిషన్ పై విచారణను  ఈ నెల   21కి వాయిదా వేసింది హైకోర్టు.    


హైదరాబాద్: విచారణకు  బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ సహకరించడం లేదని  అడ్వకేట్  జనరల్  హైకోర్టు దృష్టికి తీసుకువచ్చారు. టెన్త్ క్లాస్  హిందీ  పేపర్ లీక్ కట్ర లో తనపై  విధించిన  రిమాండ్  ను  రద్దు  చేయాలని  కోరుతూ  ఈ నెల 6న  హైకోర్టులో  బండి సంజయ్  పిటిషన్ దాఖలు చేశారు . ఈ పిటిషన్ పై  విచారణను  ఇవాళ్టికి  తెలంగాణ  హైకోర్టు  వాయిదా వేసింది.  

సోమవారంనాడు  తెలంగాణ హైకోర్టు  ఈ పిటిషన్ పై  విచారణ  నిర్వహించింది.   టెన్త్  క్లాస్  పేపర్ లీక్ కేసులో  ఫోన్  ను  ఇంకా  బండి  సంజయ్  అప్పగించలేదని  అడ్వకేట్  జనరల్   హైకోర్టు దృష్టికి తీసుకెళ్లారు, ఈ కేసులో  బండి సంజయ్  కు బెయిల్ లభించిందని కోర్టుకు  ఏజీ చెప్పారు. మరో వైపు  ఈ విషయమై  అఫిడవిట్  దాఖలు చేయాలని హైకోర్టు ఆదేశించింది . మరో వైపు  బండి  సంజయ్ కు  ఇచ్చిన  బెయిల్ ను కూడా  రద్దు చేయాలని  ఏజీ  హైకోర్టును  కోరారు.  ఈ పిటిషన్  పై విచారణను  ఈ నెల  21కి వాయిదా  వేసింది హైకోర్టు 

Latest Videos

టెన్త్  క్లాస్  హిందీ  పేపర్  ప్రశ్నాపత్రం  లీక్  కేసుకు  సబంధించి  బండి సంజయ్ ను ఈ నెల  4వ తేదీ  రాత్రి  పోలీసులు అరెస్ట్  చేశారు.  ఈ కేసులో  రిమాండ్  ను రద్దు  చేయాలని  బండి సంజయ్  హైకోర్టును ఆశ్రయించారు. ఈ పిటిషన్ పై  హైకోర్టులో  ఇవాళ  విచారణ జరిగింది.,  టీఎస్‌పీఎస్‌సీ  పేపర్ లీకేజీని  డైవర్షన్ చేసేందుకే  టెన్త్ క్లాస్  పేపర్ లీక్  అంశాన్ని  బయటకు తీసుకు వచ్చారని  బండి సంజయ్ ఆరోపించారు.  

click me!