బండి సంజయ్ రిమాండ్ ను రద్దు చేయాలని తెలంగాణ హైకోర్టులో దాఖలు చేసిన పిటిషన్ ను ఇవాళ తెలంగాణ హైకోర్టు విచారించింది.
హైదరాబాద్: టెన్త్ క్లాస్ పేపర్ లీక్ కేసులో హన్మకొండ కోర్టు విధించిన రిమాండ్ ను కొట్టివేయాలని దాఖలు చేసిన పిటిషన్ పై గురువారంనాడు తెలంగాణ హైకోర్టు విచారించింది. బండి సంజయ్ బెయిల్ పిటిషన్ దాఖలు చేసుకోవచ్చని హైకోర్టు తెలిపింది. మరో వైపు రిమాండ్ రద్దు పై విచారణను ఈ నెల 10వ తేదీకి వాయిదా వేసింది హైకోర్టు.
ఇవాళ ఉదయం తెలంగాణ హైకోర్టు లో బండి సంజయ్ తరపున బీజేపీ లీగల్ సెల్ టీమ్ లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేసింది.ఈ పిటిషన్ పై హైకోర్టు విచారించింది. 41ఏ సీఆర్‌పీసీ నోటీస్ ఇవ్వకుండా అరెస్ట్ చేశారని పిటిషనర్ ఆరోపించారు. ప్రభుత్వ అవినీతిని ప్రశ్నించినందుకే బండి సంజయ్ ను అరెస్ట్ చేశారని పిటిషనర్ ఆరోపించారు. ఈ పిటిషన్ ను అత్యవసరంగా విచారించాలని పిటిషనర్ తరపు న్యాయవాది కోరారు. దీనికి హైకోర్టు అంగీకరించింది.
ఈ పిటిషన్ ను తెలంగాణ హైకోర్టు విచారణకు స్వీకరించింది. బండి సంజయ్ అరెస్ట్ సమయంలో నిబంధనలకు విరుద్దంగా వ్యవహరించారని బండి సంజయ్ తరపు న్యాయవాదులు హైకోర్టు దృష్టికి తీసుకు వచ్చారు. టెన్త్ క్లాస్ పరీక్ష ఉదయం 9:30గంటలకు ప్రారంభమైతే 11:30 గంటలకు బండి సంజయ్ కు వాట్సాప్ లో ప్రశ్నాపత్రం వచ్చిందని న్యాయవాదులు చెప్పారు.
బండి సంజయ్ వాట్సాప్ లో సర్క్యులేట్ చేశాడు తప్ప పేపర్ లీక్ లో ఆయన ప్రమేయం ఎక్కడుందని హైకోర్టు ప్రశ్నించింది. పేపర్ బయటకు వచ్చాక రాజకీయ నేతగా బండి సంజయ్ కు సర్క్యులేట్ చేయడం లో తప్పేమిటని హైకోర్టు అడిగింది. పేపర్ లీక్ అంశంలో బండి సంజయ్ ప్రధాన కుట్రదారుడిగా అడ్వకేట్ జనరల్ పేర్కొన్నారు. బండి సంజయ్ ఫోన్ ఇంకా ఫోన్ ఇవ్వలేదని ఏజీ కోర్టుకు తెలిపారు.
also read:బండి సంజయ్ రిమాండ్ రద్దు: తెలంగాణ హైకోర్టులో బీజేపీ లంచ్ మోషన్ పిటిషన్
. ఈ నెల 8న హైద్రాబాద్ లో మోడీ టూర్ ఉన్న నేపథ్యంలో బండి సంజయ్ ఈ కార్యక్రమానికి హాజరు కావాల్సి ఉందని బండి సంజయ్ తరపు న్యాయవాది హైకోర్టుకు తెలిపారు. బెయిల్ పిటిషన్ వేసుకోవాలని హైకోర్టు స్పష్టం చేసింది. అయితే ఈ బెయిల్ పై ఇవాళే నిర్ణయం తీసుకోనేలా ఆదేశాలు ఇవ్వాలని కోర్టును బండి తరపు న్యాయవాదులు కోరారు. కింది కోర్టు బెయిల్ పై ఇచ్చే తీర్పుపై అప్పీల్ కు హైకోర్టు సానుకూలంగా స్పందించిందని బండి సంజయ్ తరపు న్యాయవాది మీడియాకు చెప్పారు. మరో వైపు రిమాండ్ రద్దుపై విచారణను ఈ నెల 10వ తేదీకి వాయిదా వేసింది.