తెలంగాణ శాసనమండలి డిప్యూటీ చైర్మెన్: బండ ప్రకాష్ ఏకగ్రీవంగా ఎన్నిక

By narsimha lode  |  First Published Feb 12, 2023, 12:20 PM IST

తెలంగాణ శాసనమండలి  డిప్యూటీ చైర్మెన్ గా బండ ప్రకాష్  ఏకగ్రీవంగా  ఎన్నికయ్యారు.  సీఎం కేసీఆర్ తో పాటు  పలువురు ప్రజా ప్రతినిధులు  బండ ప్రకాష్ ను  కుర్చీలో  కూర్చోబెట్టారు.  


హైదరాబాద్: తెలంగాణ శాసనమండలి డిప్యూటీ చైర్మెన్ గా బండ ప్రకాష్  ఎకగ్రీవంగా  ఎన్నికయ్యారు.ఈ విషయాన్ని తెలంగాణ శాసనమండలి చైర్మెన్  గుత్తా సుఖేందర్ రెడ్డి  ఆదివారం నాడు ప్రకటించారు. 

తెలంగాణ శానసమండలి డిప్యూటీ చైర్మెన్ పదవి ఎన్నిక నిర్వహణ కోసం  రెండు రోజుల క్రితం  నోటిఫికేషన్ దాఖలైంది. డిప్యూటీ చైర్మెన్  పదవి కోసం   బండ ప్రకాష్  నిన్న నామినేషన్ దాఖలు  చేశారు.   ఈ పదవికి  ఎవరూ  నామినేషన్ దాఖలు చేయలేదు.  దీంతో   బండ ప్రకాష్  ఏకగ్రీవంగా  ఎన్నికైనట్టుగా శాసనమండలి చైర్మెన్   గుత్తా సుఖేందర్ రెడ్డి  ఇవాళ ప్రకటించారు.

Latest Videos

also read:తెలంగాణ శాసనమండలి డిప్యూటీ చైర్మెన్ ఎన్నికకు నోటిఫికేషన్: ఈ నెల 12న ఎన్నిక

 తెలంగాణ సీఎం కేసీఆర్ , మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి,   మండలిలో  విపక్ష నేత  జీవన్ రెడ్డి తదితరులు  డిప్యూటీ చైర్మెన్ బండ ప్రకాష్ ను  కుర్చీలో  కూర్చోబెట్టారు.  బండ ప్రకాష్ ను  పలువురు ఎమ్మెల్సీలు,  ప్రజా ప్రతినిధులు , అధికారులు బండ ప్రకాష్ ను అభినందించారు. 
 

click me!