
గౌతమీపుత్ర శాతకర్ణి తెలంగాణ అసెంబ్లీకి వచ్చాడు. అదేనండి సినీ నటుడు, హిందూపురం శాసనసభ్యుడు నందమూరి బాలకృష్ణ.
దీంతో శుక్రవారం తెలంగాణ అసెంబ్లీలో సందడి నెలకొంది. తెలంగాణ టీడీపీ నేతలు ఆయనకు సాదర స్వాగతం పలికారు.
అసెంబ్లీలో సీఎం కేసీఆర్‌ను కలవడానికి వచ్చిన బాలకృష్ణ.. నేరుగా అసెంబ్లీలోని తెదేపా కార్యాలయానికి వెళ్లారు.
‘గౌతమిపుత్ర శాతకర్ణి’కి తెలంగాణలో రాయితీ ఇచ్చినందుకు సీఎంకు ఈ సందర్భంగా ఆయన కృతజ్ఞతలు చెప్పారు.
బాలకృష్ణ సినీ కెరీర్‌లో 100వ చిత్రం కావడంతో ఈ చిత్రంలో భారీ అంచనాలు నెలకొన్నాయి.