కోడిగుడ్డు కోసం గొడవ: యువకుడిని చితకబాదిన రౌడీషీటర్లు

Siva Kodati |  
Published : Apr 02, 2019, 10:15 AM IST
కోడిగుడ్డు కోసం గొడవ: యువకుడిని చితకబాదిన రౌడీషీటర్లు

సారాంశం

నిజామాబాద్‌లో రౌడీషీటర్లు రెచ్చిపోయారు. అందరూ చూస్తుండగానే నడిరోడ్డుపై ఓ యువకుడిని సీసాలతో చితకబాదారు. నగరంలోని కోటగల్లికి చెందిన రాజు అనే యువకుడు స్థానిక సూపర్‌ మార్కెట్‌లో కోడిగుడ్డు కొనే విషయంలో అతనితో ఇద్దరు వ్యక్తులు గొడవ పడ్డారు

నిజామాబాద్‌లో రౌడీషీటర్లు రెచ్చిపోయారు. అందరూ చూస్తుండగానే నడిరోడ్డుపై ఓ యువకుడిని సీసాలతో చితకబాదారు. నగరంలోని కోటగల్లికి చెందిన రాజు అనే యువకుడు స్థానిక సూపర్‌ మార్కెట్‌లో కోడిగుడ్డు కొనే విషయంలో అతనితో ఇద్దరు వ్యక్తులు గొడవ పడ్డారు.

ఈ క్రమంలో కోపంతో ఊగిపోయిన ఇద్దరు రౌడీషీటర్లు రాజుపై దాడికి దిగారు. పక్కనే ఉన్న కూల్‌డ్రింక్ సీసాలతో విచక్షణారహితంగా కొట్టారు. తీవ్ర రక్తస్రావం కావడంతో రాజును ఆస్పత్రికి తరలించారు. నిందితులపై హత్యాయత్నం కేసును నమోదు చేశారు పోలీసులు. కాగా ఈ సంఘటనతో జనం భయభ్రాంతులకు గురయ్యారు. 

PREV
click me!

Recommended Stories

Hyderabad వైపు ట్రంప్ చూపు.. ఈ ప్రాంతం మరో కోకాపేట్ కావడం ఖాయం...!
Telangana Holidays : 2026 లో ఏకంగా 53 రోజుల సెలవులే..! ఏరోజు, ఎందుకో తెలుసా?