సాయంత్రం 7 తర్వాత కెటిఆర్ ఎటు పోతాడబ్బా ?

Published : Jul 28, 2017, 06:37 PM ISTUpdated : Mar 25, 2018, 11:39 PM IST
సాయంత్రం 7 తర్వాత కెటిఆర్ ఎటు పోతాడబ్బా ?

సారాంశం

సాయంత్రం 7 తర్వాత కెటిఆర్ ఎటు పోతాడో తెలుసుకో కెటిఆర్ కదలికలపై నిఘా అధికారులతో విచారించు కెటిఆర్ బలహీనతలేంటో దృష్టి  పెట్టండి కెటిఆర్ పై సిఎం కెసిఆర్ కు రేవంత్ సలహా

తెలంగాణ టిడిపి నేత రేవంత్ ఆసక్తికరమైన విషయం వెల్లడించారు. సిఎం కెసిఆర్, మంత్రి కెటిఆర్ పై కరుకు మాటలతో విరుచుకుపడే రేవంత్ శుక్రవారం ఎన్టీఆర్ భవన్ లో జరిగిన విలేకరుల సమావేశంలో విమర్శల ఘాటు తగ్గించి మాట్లాడారు.  ఉద్వేగంతో మాట్లాడారు. అయినప్పటికీ ఉద్వేగంలోనూ కొన్ని డైలాగులు సూటిగా పేల్చారు.

ఇక కెటిఆర్ గురించి, ఆయన బామ్మార్ది రాజేంద్ర ప్రసాద్ గురించిన సమాచారం ఎక్కువగా వెల్లడించారు. మంత్రి కెటిఆర్ బలహీనతల గురించి సిఎం తెలుసుకోవాలన్నారు. కెటిఆర్ బలహీనతలను ఆసరాగా చేసుకుని హైదరాబాద్ లో డ్రగ్ వ్యాపారం జరుగుతుందని ఆరోపించారు రేవంత్. అసలు డ్రగ్స్ విషయంలో ముందుగా కెటిఆర్ బలహీనతలు ఏమిటో సిఎం కెసిఆర్ గుర్తించాలని సూచించారు. ప్రతిరోజు సాయంత్రం 7 గంటల తర్వాత కెటిఆర్ ఎక్కడికి పోతున్నాడో, ఏం చేస్తున్నాడో నిఘా సంస్థల ద్వారా వివరాలు తెప్పించుకుని విచారించుకోవాలని సిఎం కు సలహా ఇచ్చారు.

డ్రగ్స్ వ్యాపారంలో కెటిఆర్ బామ్మార్ది, ఆయన భార్య ఇద్దరూ ఇన్వాల్వ్ అయ్యారని రేవంత్ ఆరోపించారు. మంత్రి కెటిఆర్, ఆయన బావమరిది కలిసి దిగిన ఫొటోను మీడియాకు విడుదల చేశారు రేవంత్. రాజేంద్రప్రసాద్ పాకాల దంపతులు నడిపే పబ్ లో గర్ల్స్ పికప్ సెంటర్ కూడా నడుస్తోందంటూ ఆరోపించారు రేవంత్. ఇవన్నీ సిఎం కెసిఆర్ కు తెలిసి జరుగుతున్నాయని తాను భావించడంలేదంటూ రేవంత్ చెప్పుకొచ్చారు.

PREV
click me!

Recommended Stories

సజ్జనార్ నువ్వు కాంగ్రెస్ కండువా కప్పుకో: Harish Rao Comments on CP Sajjanar | Asianet News Telugu
Harish Rao Serious Comments: సైబర్ నేరగాళ్లకు రేవంత్ రెడ్డికి తేడా లేదు | Asianet News Telugu