మద్యం ప్రియులకు బ్యాడ్ న్యూస్.. రెండు రోజుల పాటు లిక్కర్ షాపులు బంద్.. ఎందుకంటే ?

Published : Jul 14, 2023, 12:32 PM IST
మద్యం ప్రియులకు బ్యాడ్ న్యూస్.. రెండు రోజుల పాటు లిక్కర్ షాపులు బంద్.. ఎందుకంటే ?

సారాంశం

మద్యం ప్రియులకు హైదరాబాద్ పోలీసులు బ్యాడ్ న్యూస్ చెప్పారు. రెండు రోజుల పాటు లిక్కర్ షాపులు బంద్ చేయాలని ఆదేశాలు జారీ చేశారు. బోనాల సందర్భంగా ఈ నిర్ణయం తీసుకున్నారు. 

మద్యం ప్రియులకు ఇది బ్యాడ్ న్యూస్. రెండు రోజుల పాటు లిక్కర్ షాపుల మూసి ఉంచాలని హైదరాబాద్ పోలీసులు ఆదేశించారు. వచ్చే ఆదివారం హైదరాబాద్ లో బోనాల పండగ నేపథ్యంలో ఈ ఆదేశాలు వెలువడ్డాయి. జూలై 16,17,18వ తేదీల్లో లిక్కర్ షాపులు తెరవకూడదని పేర్కొన్నారు.

చంద్రయాన్-3.. జూలైలోనే చంద్రుడిపైకి ఎందుకీ ప్రయాణం..? ప్రయోగాన్ని మనం లైవ్ లో చూడాలంటే ఎలా ? పూర్తి వివరాలు

సౌత్‌ ఈస్ట్‌, సౌత్‌ వెస్ట్‌ జోన్లలో జూలై 16వ తేదీ ఉదయం 6 గంటల నుంచి ఈ ఆదేశాలు అమల్లోకి రానున్నాయి. 17వ తేదీ సాయంత్ర 6 గంటల వరకు మద్యం దుకాణాలు మూసి ఉండనున్నాయి. అలాగే సౌత్ జోన్ పరిధిలో 16వ తేదీ ఉదయం ఈ ఆదేశాలు అమల్లోకి వచ్చి, 18వ తేదీ ఉదయం 6 గంటల వరకూ కొనసాగనున్నాయి. తాము పేర్కొన్న సమయాల్లో లిక్కర్ షాపులు మూసి వేయాలని హైదరాబాద్ సిటీ పోలీసు కమిషర్ ఉత్తర్వుల్లో తెలిపారు.

PREV
click me!

Recommended Stories

కేవలం పది పాసైతే చాలు.. హైదరాబాద్ లోనే రూ.1,42,400 శాలరీతో సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్
Cold Wave Alert : ఈ మూడ్రోజులు తస్మాత్ జాగ్రత్త.. ఈ ప్రాంతాలకు పొంచివున్న చలిగండం..!