హైద్రాబాద్ దోమలగూడ గ్యాస్ సిలిండర్ పేలుడు: చికిత్స పొందుతూ మరో ముగ్గురు మృతి

By narsimha lode  |  First Published Jul 14, 2023, 11:53 AM IST


హైద్రాబాద్ దోమలగూడ గ్యాస్ సిలిండర్ పేలుడు ఘటనలో ఇవాళ మరో ముగ్గురు మృతి చెందారు.  ఈ ఘటనలో మృతి చెందిన వారి సంఖ్య నాలుగుకు చేరుకుంది.


హైదరాబాద్:  నగరంలోని దోమలగూడలో గ్యాస్ సిలిండర్ పేలుడు ఘటనలో శుక్రవారంనాడు  మరో ముగ్గురు మృతి చెందారు.  దీంతో  ఈ ఘటనలో మృతి చెందిన వారి సంఖ్య నాలుగుకు చేరింది. ఈ ఘటనలో  మొత్తం ఏడుగురు తీవ్రంగా గాయపడ్డారు.  ఈ నెల  12వ తేదీన చిన్నారి శరణ్య మృతి చెందింది.  ఇవాళ  నాగమణి, ధనలక్ష్మి, అభి మృతి చెందారు.   ఈ ప్రమాదంలో  గాయపడిన వారిలో ముగ్గురి పరిస్థితి కూడ విషమంగా ఉందని వైద్యులు చెబుతున్నారు.

అగ్ని ప్రమాదానికి  గ్యాస్ లీక్ కావడమే కారణంగా అధికారులు  గుర్తించారు. కమర్షియల్ గ్యాస్ సిలిండర్ రెగ్యులేటర్ ను  డొమెస్టిక్ గ్యాస్ సిలిండర్ కు ఉపయోగించడంతో ఈ ప్రమాదం జరిగిందని  అధికారులు తెలిపారు.

Latest Videos

 


 

click me!