యువతిపై ప్రేమోన్మాది దాడి.. ఓయూలో ఘటన...

Published : Sep 26, 2022, 09:06 AM IST
యువతిపై ప్రేమోన్మాది దాడి.. ఓయూలో ఘటన...

సారాంశం

ప్రేమించమంటే ప్రేమించడం లేదని ఓ యువకుడు యువతి మీద కత్తితో దాడి చేశాడు. ఈ ఘటన ఓయూ పరిధిలో కలకలం రేపింది. 

హైదరాబాద్ : ప్రేమను అంగీకరించలేదని ఓ యువతిపై యువకుడు పదునైన ఆయుధంతో దాడి చేశాడు ఉస్మానియా యూనివర్సిటీ పరిధిలో ఈ ఘటన చోటు చేసుకుంది.  ఉస్మానియా యూనివర్సిటీ పోలీస్ స్టేషన్ ఇన్స్పెక్టర్ రమేష్ నాయక తెలిపిన వివరాల ప్రకారం… ముషీరాబాద్ భోలక్ పూర్ బస్తీకి చెందిన యువతి (18) ఓ ప్రైవేటు మెడికల్ దుకాణంలో పనిచేస్తుంది. అదే బస్తీకి చెందిన రంజిత్ (18) అనే యువకుడు ప్రేమపేరుతో ఆమె వెంటపడుతున్నాడు. మాట్లాడుకుందాం అని చెప్పి ఓయూలోని మానేరు వసతి గృహం వద్దకు శనివారం రాత్రి ఏడు గంటల ప్రాంతంలో తీసుకువచ్చాడు.

అక్కడ ఇద్దరి మధ్య మాటామాటా పెరిగి గొడవకు దారితీసింది. దీంతో తన వెంట తెచ్చుకున్న పదునైన ఆయుధంతో రంజిత్ ఆమెపై దాడి చేశాడు. ఈ దాడిలో యువతి చెయ్యికి తీవ్ర గాయమైంది. ఆమె గట్టిగా అరవడంతో రంజిత అక్కడినుంచి పారిపోయాడు. స్థానికులు, పోలీసులు యువతిని కాచిగూడలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. యువతి ఆరోగ్యం ప్రస్తుతం నిలకడగా ఉంది. ఆమె సోదరుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి, నిందితుడిని కోసం గాలిస్తున్నట్లు రమేష్ నాయక్ తెలిపారు. 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

హైద‌రాబాద్‌లో మరో KPHB కాలనీ.. ప్రతీ ఒక్కరి సొంతింటి కల నిజం చేసేలా, ఎక్కడో తెలుసా?
GCC: హైద‌రాబాద్ ముఖ చిత్రాన్ని మార్చేస్తున్న గ్లోబల్ క్యాపబిలిటీ సెంటర్లు.. అస‌లేంటీవి? వీటితో జ‌రిగేదేంటీ