ఎర్రగడ్డ మెంటల్ హాస్పిటల్ లో దారుణం.. మహిళా పేషెంట్ పై మరో పేషెంట్, అటెండెంట్ అత్యాచారయత్నం..

Published : Aug 10, 2023, 10:00 AM ISTUpdated : Aug 10, 2023, 10:01 AM IST
ఎర్రగడ్డ మెంటల్ హాస్పిటల్ లో దారుణం.. మహిళా పేషెంట్ పై మరో పేషెంట్, అటెండెంట్ అత్యాచారయత్నం..

సారాంశం

ట్రీట్ మెంట్ తీసుకోవడానికి వచ్చిన ఓ మహిళా మానసిక రోగిపై మరో రోగి, అతడి సహాయకుడు అత్యాచారం చేసేందుకు ప్రయత్నించారు. ఈ ఘటన హైదరాబాద్ లోని మెంటల్ హాస్పిటల్ ప్రాంగణంలో చోటు చేసుకుంది.

ఆ మహిళ మానసిక అనారోగ్యంతో బాధపడుతోంది. దీంతో ఆమె తల్లిదండ్రులు ట్రీట్ మెంట్ కోసం హాస్పిటల్ కు తీసుకొచ్చారు. అయితే మూత్ర విసర్జన కోసం వెళ్లి వస్తానని తల్లిదండ్రులకు చెప్పి ఆమె బయటకు వెళ్లింది. ఒంటరిగా ఉన్న ఆమెను చూసి ఆ హాస్పిటల్ కు ట్రీట్ మెంట్ తీసుకోవడానికి వచ్చిన మరో రోగి, అతడి సహాయకుడు అత్యాచారయత్నానికి పాల్పడ్డాడు. ఈ ఘటన హైదరాబాద్ లోని ఎర్రగడ్డ మెంటల్ హాస్పిటల్ లో చోటు చేసుకుంది.

కార్టూన్లు చూస్తూ టీవీ సెట్ టాప్ బాక్స్ ను తాకిన 4 ఏళ్ల బాలుడు.. కరెంట్ షాక్ రావడంతో మృతి

‘ఈనాడు’ కథనం ప్రకారం.. ఖమ్మం జిల్లాకు చెందిన 40 ఏళ్ల మహిళకు మానసిక ఆరోగ్యం బాగాలేదు. దీంతో ఆమెను కుటుంబ సభ్యులు ట్రీట్ మెంట్ కోసం హైదరాబాద్ లో ఉన్న ఎర్రగడ్డ మెంటల్ హాస్పిటల్ కు బుధవారం తీసుకొచ్చారు. కుటుంబ సభ్యులతో కలిసి ఆ మహిళ కూడా ఓపీ బ్లాక్ వద్ద నిలబడి ఉంది. అయితే మూత్ర విసర్జన చేసేందుకు వెళ్తానంటే కుటుంబ సభ్యులు సమ్మతించారు.

అమ్మా అనే పిలుపు కోసం 20 ఏళ్ల ఎదురుచూపు.. ఒకే కాన్పులో ముగ్గురికి జన్మినిచ్చినా.. చివరికి

దీంతో ఆమె ఓ పొదల వైపు వెళ్లింది. అయితే అదే సమయంలో ఆ హాస్పిటల్ లో ట్రీట్ మెంట్ పొందుతున్న ఓ పేషెంట్, అతడి అటెండెంట్ అక్కడే ఉన్నారు. ఆ మహిళ దగ్గరికి వచ్చి ఆమెతో అసభ్యకరంగా వ్యవహరించారు. అత్యాచారం చేసేందుకు ప్రయత్నించారు. అయితే కుటుంబ సభ్యులు అప్రమత్తమై అక్కడికి వెళ్లారు. దీంతో పేషెంట్, అతడి అటెండెంట్ అక్కడి నుంచి పారిపోయాడు.

జాక్ పాట్ కొట్టాడు.. వరించిన రూ.13 వేల కోట్ల లాటరీ.. ఎవరికంటే ?

ఈ విషయం తెలియడంతో హాస్పిటల్ సూపరింటెండెంట్‌ బాధితురాలి కుటుంబ సభ్యులతో మాట్లాడారు. అయితే దీనిపై ఫిర్యాదు చేసేందుకు వారు ఒప్పుకోలేదు. ఇప్పుడు సమస్య ఏం లేదని చెప్పారు. తాము ఫిర్యాదు చేయాలని అనుకోవడం లేదని తెలిపారు. ఈ విషయాన్ని వారు ఓ లేఖ రూపంలో రాసి హాస్పిటల్ లో పని చేసే నర్సుకు అందజేశారు. 

PREV
click me!

Recommended Stories

IMD Cold Wave Alert : మరోసారి కుప్పకూలనున్న టెంపరేచర్స్.. ఈ నాల్రోజులు చుక్కలే
Hyderabad IT Jobs : మీరు సాప్ట్ వేర్ జాబ్స్ కోసం ప్రయత్నిస్తున్నారా..? కాగ్నిజెంట్ లో సూపర్ ఛాన్స్, ట్రై చేయండి