
మంచిర్యాల : తెలంగాణలోని మంచిర్యాల జిల్లాలో మరో హత్య కేసు వెలుగు చూసింది. వివాహేతర సంబంధానికి మరో వ్యక్తి బలయ్యాడు. మంచిర్యాల జిల్లా తాండూరు నగరం క్రాస్ రోడ్ దగ్గర సిద్ధం శ్రీనివాస్ అనే వ్యక్తి అనుమానాస్పదస్థితిలో మృతి చెందాడు. వివాహేతర సంబంధం కారణంగానే అతను మృతి చెందాడని పోలీసులు నిర్థారించారు. భార్య బానక్క, ఆమె ప్రియుడు శంకర్ కలిసి శ్రీనివాస్ ను హత్య చేసినట్లుగా పోలీసులు తెలిపారు. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.