Telangana: బర్త్ డే నాడే గుండెపోటుతో బాలుడు హఠాన్మరణం.. బర్త్ డే వేడుక చేసిన తర్వాతే అంత్యక్రియలు.

By Mahesh KFirst Published May 20, 2023, 7:38 PM IST
Highlights

కొమురం భీమ్ అసిఫాబాద్ జిల్లాలో 16 ఏళ్ల బాలుడు తన బర్త్ డే వేడుకలు ఘనంగా నిర్వహించాలని ప్లాన్ చేసుకున్నాడు. గురువారం మధ్యాహ్నం కల్లా కేక్, క్రాకర్లు, స్వీట్లు, బెలూన్లు అన్ని కొనుక్కున్నాడు. కానీ, సాయంత్రం గుండెపోటుతో మరణించాడు. అర్థరాత్రి డెడ్ బాడీ ముందు బర్త్ డే చేసి ఆ తర్వాత బాలుడికి అంత్యక్రియలు నిర్వహించారు.
 

అసిఫాబాద్: ఆ బాలుడు తన బర్త్ డే సెలెబ్రేషన్స్ ఘనంగా జరుపుకోవాలనుకున్నాడు. పేరెంట్స్ కూడా అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. ఆ బాలుడు కేక్, క్రాకర్లు, బెలూనన్లు, స్వీట్లు ముందే కొనుగోలు చేసి రెడీగా ఉన్నాడు. సాయంత్రంపూట బర్త్ డే సెలెబ్రేషన్స్ ఇక గ్రాండ్‌గా జరగడానికి అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఇంతలో బర్త్ డే బాయ్ ఛాతిలో నొప్పి వచ్చింది. హాస్పిటల్ తీసుకెళ్లారు. కానీ, నయం కాలేదు. పుట్టిన రోజే గిట్టాల్సి వచ్చింది. దీంతో ఆ ఏరియాలో విషాదం నెలకొంది. తల్లిదండ్రులు సహా బంధువులు, ఇరుగుపొరుగు కన్నీరుమున్నీరు అయ్యారు. ఎంతో ఆబగా బర్త్ డే కోసం ఎదురుచూసి ఏర్పాట్లు పూర్తి చేసుకుని కన్నుమూశాడనీ బాధపడ్డారు. దీంతో అర్థరాత్రి వరకు డెడ్ బాడీ అలాగే ఉంచి బర్త్ డే చేసిన తర్వాత అంత్యక్రియలు నిర్వహించాలని కుటుంబ సభ్యులు డిసైడ్ అయ్యారు. ఈ ఘటన కొమురం భీమ్ అసీఫాబాద్ జిల్లాలో అసిఫాబాద్ మండంలోని బాబాపూర్ గ్రామంలో చోటుచేసుకుంది.

చునర్కర్క్ సచిన్ (16) తన బర్త్ డే వేడుకల కోసం ఆతృతగా ఎదురుచూస్తున్నాడు. తన బర్త్ డే పార్టీని గురువారం రాత్రి గ్రాండ్ గా నిర్వహించాలని ప్లాన్ చేసుకున్నాడు. మధ్యాహ్నం కల్లా తాను కొనుగోలు చేయాల్సినవన్నీ తెచ్చుకున్నాడు. కానీ, సాయంత్రం అనూహ్య పరిణామం చోటుచేసుకుంది. సచిన్ ఛాతిలో నొప్పి మొదలైంది. దీంతో చికిత్స కోసం అసిఫాబాద్‌లో ఓ డాక్టర్‌ను కలిశాడు. అతను మంచిర్యాల్ హాస్పిటల్‌కు వెళ్లాలని సూచించాడు. మంచిర్యాల్‌కు తరలించినా సచిన్ ప్రాణాలు కోల్పోయాడు. 

Also Read: కర్ణాటక కిక్కుతో తెలంగాణ కాంగ్రెస్ దూకుడు.. వరుస సభలతో జోరు

తన బర్త్ డే కోసం సచిన్ అన్ని ఏర్పాట్లు చేశాడు. వాటన్నింటినీ చూసిన తల్లిదండ్రులు, బంధువులు శోకసంద్రంలో మునిగారు. ఆ రాత్రి కచ్చితంగా సచిన్ బర్త్ డే నిర్వహించాల్సిందే అని నిర్ణయించుకున్నారు. అర్థరాత్రి సచిన్ డెడ్ బాడీ దగ్గరే బర్త్ డే చేశారు. ఆ తర్వాత అంత్యక్రియలు నిర్వహించారు.

సచిన్ ఇటీవలే ఎస్ఎస్‌సీ ఎగ్జామ్స్ పాసయ్యాడు. 7.7 జీపీఏ స్కోర్ సాధించాడు. గునావంత్ రావు, లలితల చిన్న కొడుకు సచిన్.

click me!