రాంగ్‌రూట్లో వచ్చిన బైకర్ కు ఫైన్ వేస్తామన్న పోలీసులు: అమీర్ పేటలో బైక్ కు నిప్పు పెట్టిన బైకర్

By narsimha lodeFirst Published Oct 3, 2022, 6:33 PM IST
Highlights

హైద్రాబాద్ నగరంలో రాంగ్ రూట్ లో వచ్చిన తనను నిలిపివేయడంతో ఆశోక్ అనే వ్యక్తి బైక్ ను దగ్దం చేశాడు.  ఈ ఘటన అమీర్ పేట మైత్రీవనం వద్ద జరిగింది. 

హైదరాబాద్: రాంగ్ రూట్లో వచ్చినందుకు నిలిపివేయడంతో తన బైక్ ను దగ్ధం చేశాడు ఆశోక్ అనే వ్యక్తి. ఈ ఘటన హైద్రాబాద్ నగరంలోని అమీర్ పేటలో సోమవారం నాడు  జరిగింది.హైద్రాబాద్ నగరంలోని పోలీసులు ట్రాఫిక్ పై స్పెషల్ డ్రైవ్ నిర్వహిస్తున్నారు.  నాలుగు రోజులపాటు కొత్త నిబంధనలపై వాహనదారులపై అవగాహన కల్పిస్తున్నారు.

అయితే ఇవాళ మధ్యాహ్నం హైద్రాబాద్ సంజీవరెడ్డి నగర్ లోని  ఎల్లారెడ్డిగూడకు చెందిన ఆశోక్ అనే వ్యక్తి అమీర్ పేట మైత్రీవనం వద్ద రాంగ్ రూట్ లో బైక్ పై వస్తున్నాడు. ఈ విషయాన్ని గమనించిన ట్రాఫిక్ పోలీసులు ఆయనను నిలిపివేశారు.  దీంతో పోలీసులతో వాగ్వాదానికి దిగాడు ఆశోక్. రాంగ్ రూట్లో వాహనంపై వస్తున్నందున చలాను విధించనున్నట్టుగా పోలీసులు చెప్పారు. దీంతో ఆగ్రహం పట్టలేక ఆశోక్ తన బైక్ లోని పెట్రోల్ ను తీసిబైక్ ను దగ్దం చేశారు. వెంటనే పోలీసులు ఫైరింజన్ ను తీసుకు వచ్చి మంటలను ఆర్పారు.  నడిరోడ్డుపై బైక్ ను దగ్దం చేసిన ఆశోక్ పై కేసు నమోదు  చేస్తామని పోలీసులు తెలిపారు.  

ఆపరేషన్  రోప్ ను హైద్రాబాద్ పోలీసులు అమలు చేస్తున్నారు. ట్రాఫిక్ సిగ్నల్ వద్ద స్టాప్ సిగ్నల్ వద్ద లైన్  దాటితే పైన్ విధించనున్నారు. ఫ్రీ లెఫ్ట్ కు ఆటంకం కలిగిస్తే జరిమానా విధిస్తారు. పుట్ పాత్ పై పాదచారులు నడిచేలా చర్యలు తీసుకొంటున్నారు. పుట్ పాత్ పై దుకాణాలు నడిపితే చర్యలు తీసుకొంటామనిపోలీసులు స్పష్టం చేశారు.  ఈ విషయమై పోలీసులు అవగాహన కల్పిస్తున్నారు. ట్రాఫిక్ రూల్స్ ను కచ్చితంగా పాటించాల్సిందేనని పోలీసులు తేల్చి చెప్పారు. 

ఆపరేషన్ రోప్ పై  అమల్లో భాగంగా మైత్రీవనం వద్ద పోలీసులు విధుల్లో ఉన్న సమయంలో ఆశోక్ రాంగ్ రూట్లో వచ్చాడు. దీంతో ఆశోన్ ను పోలీసులు నిలిపివేశారు. జరిమానా విధిస్తామని చెప్పడంతో ఆయన కోపంతో తన బైక్ ను దగ్దం చేసుకున్నాడు.
 

click me!