అలా అంటే మహేష్ బాబు ఫీల్ అవుతారు.. మై విలేజ్ షోలో పాల్గొంటాను.. గంగవ్వను కలవడంపై కేటీఆర్ ఏమన్నారంటే..

Published : Oct 03, 2022, 05:33 PM ISTUpdated : Oct 03, 2022, 06:40 PM IST
అలా అంటే మహేష్ బాబు ఫీల్ అవుతారు.. మై విలేజ్ షోలో పాల్గొంటాను.. గంగవ్వను కలవడంపై కేటీఆర్ ఏమన్నారంటే..

సారాంశం

యూట్యూబ్ స్టార్, బిగ్ బాస్‌ ఫేమ్ గంగవ్వను టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, తెలంగాణ మంత్రి కేటీఆర్ కలిశారు. ఆదివారం కరీంన‌గ‌ర్ క‌ళోత్స‌వ ముగింపు వేడుక‌లకు హాజ‌రైన కేటీఆర్.. గంగ‌వ్వ‌ను ఆత్మీయ ఆలింగ‌నం చేసుకున్నారు.

యూట్యూబ్ స్టార్, బిగ్ బాస్‌ ఫేమ్ గంగవ్వను టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, తెలంగాణ మంత్రి కేటీఆర్ కలిశారు. ఆదివారం కరీంన‌గ‌ర్ క‌ళోత్స‌వ ముగింపు వేడుక‌లకు హాజ‌రైన కేటీఆర్.. గంగ‌వ్వ‌ను ఆత్మీయ ఆలింగ‌నం చేసుకున్నారు. వేదికపై ప్రసంగించే సమయంలో గంగవ్వ గురించి మాట్లాడిన కేటీఆర్.. గంగవ్వను సోషల్ మీడియాలో చూసిందే తప్ప ఎప్పుడూ కలవలేదని చెప్పారు. గంగవ్వ మంచిది కాబట్టి ఏదో తనను మహేష్ బాబు అన్నదని.. అలా అంటే మహేష్ బాబు ఫీల్ అవుతారని అన్నారు. గంగవ్వా ఎందుకైనా మంచిది ఒకసారి కళ్లు టెస్ట్ చేయించుకోవాలని సరదాగా కామెంట్ చేశారు. అదే సమయంలో గంగవ్వ మై విలేజ్ షోలో తాను పాల్గొంటానని మాట ఇచ్చారు. తాను కూడా మై విలేజ్ షో ద్వారా నాలుగు విషయాలు నెర్చుకుంటానని చెప్పారు. 

ఇదిలా ఉంటే.. గంగవ్వను ఆత్మీయ ఆలింగనం చేసుకన్న ఫొటోను తెలంగాణ డిజిట‌ల్ మీడియా డైరెక్ట‌ర్ కొణతం దిలీప్ ట్విట్టర్‌లో పోస్టు చేశారు. దీనిపై స్పందించిన కేటీఆర్.. పాపులర్, పక్కా లోకల్ యూ ట్యూబ్ స్టార్ గంగవ్వను కలవడం ఆనందంగా ఉందని అన్నారు. గంగవ్వ మై విలేజ్ షోకి తాను అతిథిగా వస్తానని ఆమెకు ప్రామిస్ చేశారు. ప్రస్తుతం కేటీఆర్ ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. 

 

మై విలేజ్ షో యూట్యూబ్ చానెల్ ద్వారా గుర్తింపు తెచ్చుకున్నారు గంగవ్వ. ఆ గుర్తింపుతోనే ఆమె తెలుగు బిగ్ బాస్‌ షో‌లో కూడా కంటెస్టెంట్‌గా పాల్గొన్నారు. అక్కడ కూడా తనదైన ముద్ర వేశారు. ‌

PREV
click me!

Recommended Stories

Telangana : మూడో విడత పంచాయతీ పోలింగ్ ప్రారంభం
IMD Rain Alert : బంగాళాఖాతం మారిన వాతావరణం... ఈ ప్రాంతంలో ఇక చలివాన బీభత్సమే..!