రూ. 40 కోట్ల భూవివాదం: షేక్ పేట ఎమ్మార్వో సుజాత భర్త ఆత్మహత్య

By telugu teamFirst Published Jun 17, 2020, 10:33 AM IST
Highlights

ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో అరెస్టయిన షేక్ పేట ఎమ్మార్వో సుజాత భర్త అజయ్ ఆత్మహత్య చేసుకున్నాడు. అతను భవనంపై నుంచి బలవన్మరణానికి పాల్పడ్డారు. 

సూర్యాపేట: ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో ఆరెస్టయిన షేక్ పేట ఎమ్మార్వో సుజాత భర్త అజయ్ ఆత్మహత్య చేసుకున్నాడు. హైదరాబాదులోని బంజారాహిల్స్ భూవివాదంలో లంచం తీసుకున్న కేసులో ఇరుక్కున్న సజాతను తెలంగాణ అవినితీ నిరోధక శాఖ (ఏసీబి) అధికారులు అరెస్టు చేసిన విషయం తెలిసిందే. తన ఇంట్లో పట్టుబడిన 30 లక్షల రూపాయలకు సంబంధించిన వివరాలను వెల్లడించడంలో ఆమె విఫలమయ్యారు. దీంతో ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో ఆమెను ఏసిబీ అరెస్టు చేసింది. 

ఆ కేసులో ఏసీబీ అధికారులు సుజాత భర్తను కూడా విచారించారు. అజయ్ గాంధీనగర్ లో భవనంపై నుంచి దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. తన నివాసంలో పట్టుబడిన రూ.30 లక్షలపై విపరణ ఇవ్వడంలో సుజాత విఫలమయ్యారు. పొంతనలేని సమాధానాలు ఇవ్వడంతో ఆమెను అరెస్టు చేశారు. 

Also Read: రూ. 40 కోట్ల భూ వివాదం: షేక్ పేట్ ఎమ్మార్వో సుజాత అరెస్టు

బంజారాహిల్స్ లోని రూ.40 కోట్ల విలువ చేసే బంజారాహిల్స్ భూమి వివాదంలో రూ.15 లక్షలు లంచం తీసుకుంటూ ఆర్ఐ నాగార్జున రెడ్డిని ఏసీబీ అధికారులు రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. పోలీసు అధికారి రవీంద్ర నాయక్ ను కూడా ఏసీబి అధికారులు అరెస్టు చేశారు. 

ఈ కేసులో ఏసీబీ అధికారులు సుజాత భర్త అజయ్ వాంగ్మూలాన్ని గతంలో తీసుకున్నారు. వీఆర్వో వాంగ్మూలం కూడా రికార్డు చేశారు .

Also Read: రూ. 40 కోట్ల భూ వివాదం: సమాధానం ఇవ్వని ఎమ్మార్వో సుజాత

click me!