సూర్యాపేటలోనే కల్నల్ సంతోష్ కుమార్ అంత్యక్రియలు

By narsimha lodeFirst Published Jun 17, 2020, 10:18 AM IST
Highlights

భారత్-చైనా సరిహద్దులో సోమవారం నాడు జరిగిన ఘర్షణలో మరణించిన కల్నల్ సంతోష్ బాబు అంత్యక్రియలు స్వగ్రామం సూర్యాపేటలో నిర్వహించనున్నారు.

సూర్యాపేట: భారత్-చైనా సరిహద్దులో సోమవారం నాడు జరిగిన ఘర్షణలో మరణించిన కల్నల్ సంతోష్ బాబు అంత్యక్రియలు స్వగ్రామం సూర్యాపేటలో నిర్వహించనున్నారు. ఇవాళ ప్రత్యేక విమానంలో సంతోష్ బాబు మృతదేహం హైద్రాబాద్ కు చేరుకొంటుంది. హైద్రాబాద్ నుండి రోడ్డుమార్గంలో సంతోష్ పార్థీవ దేహాన్ని సూర్యాపేటకు తరలించనున్నారు.

సూర్యాపేటలోని విద్యానగర్‌ సంతోష్ బాబు ఇల్లు ఉంది. చైనా ఆర్మీ అధికారుల దాడిలో సంతోష్ బాబు మరణించిన విషయం తెలిసిందే. సంతోష్ బాబు అంత్యక్రియల కోసం రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాట్లు చేసింది. 

ఇవాళ మధ్యాహ్నం సంతోష్ బాబు మృతదేహం సూర్యాపేటకు చేరుకొనే అవకాశం ఉంది. ప్రభుత్వ లాంఛనాలతో ప్రభుత్వం అంత్యక్రియలు నిర్వహించనుంది. 2004లో లెఫ్టినెంట్ హోదాలో సంతోష్ బాబు సైన్యంలో చేరాడు. 15 ఏళ్ల పాటు ఆయన సర్వీసులో వివిధ హోదాల్లో పనిచేశాడు. అంచెలంచెలుగా ఆయన ఎదిగాడు.

నాలుగుసార్లు ప్రమోషన్లు పొంది ప్రస్తుతం కల్నల్ ర్యాంకులో దేశానికి సేవలందిస్తున్నాడు. చైనా ఆర్మీ దాడిలో  సంతోష్ బాబు సహా 20 మంది సైనికులు మరణించారు. సంతోష్ భార్యను సైబరాబాద్ సీపీ సజ్జనార్  బుధవారం నాడుు ఎయిర్ పోర్టులో రిసీవ్ చేసుకొన్నారు. 
 

click me!