
లడఖ్‌లో జరిగిన రోడ్డు ప్రమాదంలో తెలంగాణకు చెందిన ఓ జవాన్ అమరుడయ్యారు. ఆర్మీ జవాన్లతో వెళ్తున్న ఓ వాహనం శనివారం లడఖ్ లోని లేహ్ జిల్లాలో లోయలో పడిపోయిన సంగతి తెలిసిందే. అందులో 9 మంది సైనికులు అమరులయ్యారు. వారిలో ఒకరు రంగారెడ్డి జిల్లాకు చెందిన 30 ఏళ్ల సైనికుడు నీరటి చంద్రశేఖర్ కూడా ఉన్నారు.
కన్నతండ్రిపై 17 ఏళ్ల కుమారుడి దురాగతం.. డబ్బులివ్వలేదని దారుణ హత్య.. భూపాలపల్లిలో ఘటన
రంగారెడ్డి జిల్లా కొందుర్గు మండలం తిర్మన్ దేవునిపల్లికి చెందిన నీరటి మల్లయ్య, శివ్వమ్మ ముగ్గురు పిల్లల్లో చంద్రశేఖర్ చిన్నవారు. ఆయన పదో తరగతి మండల కేంద్రమైన కొందర్గులోని బీసీ వెల్ఫేర్ హాస్టల్ లో ఉంటూ పూర్తి చేశారు. 2011 సంవత్సరంలో ఆయన ఇండియన్ ఆర్మీలో చేరారు. కొన్నేళ్ల కిందట ఆయనకు లాస్యతో వివాహం జరిగింది. ఈ దంపతులకు కుమారుడు, కుమర్తె ఉన్నారు.
కాగా.. మూడు నెలల కిందట ఆయన సెలవులపై ఇంటికి వచ్చారు. మళ్లీ కుమారుడిని స్కూల్ లో జాయిన్ చేసేందుకు వస్తానని కుటుంబ సభ్యులకు చెప్పి విధులు నిర్వర్తించేందుకు బయలుదేరారు. కాగా.. శనివారం లేహ్ జిల్లాలో ఇతర సైనికులతో కలిసి డ్యూటీలో భాగంగా ఓ వాహనంలో ప్రయాణిస్తున్నారు. ఈ క్రమంలో ఆ వాహనం ప్రమాదవశాత్తు లోయలో పడిపోయింది. ఈ ప్రమాదంపై సమాచారం అందుకున్న భారత సైన్యం, సహాయక బృందాలు ఘటనాస్థలికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టాయి.
మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు సంతకాలు ఫోర్జరీ...
అయితే ఈ ఘటనలో 9 మంది ప్రాణాలు కోల్పోయారని ఆర్మీ అధికారులు నిర్ధారించారు. అందులో చంద్రశేఖర్ కూడా ఉన్నారు. ఈ విషయం తెలియడంతో గ్రామం ఒక్క సారిగా విషాదంలో మునిగిపోయింది. ఆయన మృతదేహం సోమవారం వరకు గ్రామానికి చేరుకునే అవశాలు ఉన్నాయి.