టిఆర్ఎస్ రసమయి అవినీతికి శ్రీనివాస్ బలి

Published : Sep 25, 2017, 06:59 PM ISTUpdated : Mar 26, 2018, 12:00 AM IST
టిఆర్ఎస్ రసమయి అవినీతికి శ్రీనివాస్ బలి

సారాంశం

శ్రీనివాస్ మృతిపై కాంగ్రెస్ సీరియస్ కలెక్టరేట్ ఎదుట దీక్షకు దిగిన ఆరేపల్లి మోహన్ రసమయి అవినీతికి శ్రీనివాస్ బలయ్యాడన్న టిడిపి

దళితులకు భూముల పంపిణీలో జరుగుతున్న అవకతవకలకు నిరసనగా ఆత్మాహుతికి పాల్పడిన మహంకాళి శ్రీనివాస్‌ వ్యవహారం మెల్లిగా రాజకీయ ఉద్యమంగా మారుతున్నది. మానకొండూరు ఎమ్మెల్యే రసమయి బలకిషన్ అవినీతికి మహాంకాళి శ్రీనివాస్ బలయ్యాడని టిపిసిసి ఎస్సీ సెల్ ఛైర్మన్ ఆరేపల్లి మోమన్ విమర్శించారు.

శ్రీనివాస్ మృతికి బాధ్యులైన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేస్తూ కలెక్టరేట్‌ ఎదుట సోమవారం టీపీసీసీ ఎస్సీ సెల్‌ చైర్మన్‌ ఆరెపల్లి మోహన్‌ నిరాహారదీక్ష చేపట్టారు. దళితుల భూ పంపిణీలో అక్రమాల వల్లే శ్రీనివాస్‌ మృతి చెందాడని, కారకులైన వారిని శిక్షించాలని డిమాండ్‌ చేశారు. ఈ కార్యక్రమంలో సంతోష్‌కుమార్‌, టీ పీసీసీ అధికారప్రతినిధి రమ్యరావు తదితరులు పాల్గొన్నారు

మహాంకాళి శ్రీనివాస్ మరణం పట్ల తెలుగుదేశం పార్టీ కూడా మరొక వైపు ఉద్యమానికి సిద్ధమవుతూ ఉంది. ఎమ్యెల్యే రసమయి, తెరాస నేతల అవినీతి కారణంగానే దళిత యువకుడు శ్రీనివాస్ మృతి చెందాడని  రేవంత్ రెడ్డి ఆరోపించారు. ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన దళిత యువకుల మరణ వాంగ్మూలాన్ని నమోదు చేయకపోవడం దారుణమన్నారు. భూ పంపిణీలో అవినీతికి పాల్పడి దళిత యువకుల ఆత్మహత్యకు కారణమైన రసమయి, తెరాస నేతలపై హత్య కేసును నమోదు చేయాలని డిమాండ్ చేశారు.

 

మరిన్ని తాజా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

 

 

 

PREV
click me!

Recommended Stories

IMD Rain Alert : దేశవ్యాప్తంగా వర్షాలు, ఈ తెలుగు జిల్లాల్లోనూ.. ఎల్లో అలర్ట్ జారీ
హైదరాబాద్‌లో రూ. 13 ల‌క్ష‌లే అపార్ట్‌మెంట్‌.. ఎవ‌రు అర్హులు, ఎలా సొంతం చేసుకోవాలంటే.?