నయీం కేసులో మరో ట్విస్ట్

First Published Sep 25, 2017, 5:31 PM IST
Highlights
  • నయీం కేసులో కదిలిన ఐటి శాఖ
  • నయీం భార్యకు ఆదాయ పన్ను శాఖ నోటీసులు

నరహంతక నయీం కేసులో మరో కదలిక వచ్చింది. ఈ కేసును మూసివేశారా అన్న అనుమానాలు ఒకవైపు కలుగుతుండగా మరోవైపు ఆదాయపన్ను శాఖ అధికారులు నయీం భార్యకు నోటీసులు పంపించారు. ఈ సంఘటన ఇప్పుడు సంచలనం కలిగిస్తోంది. 

నయీం అక్రమంగా పెద్ద మొత్తంలో ఆస్తులు కూడబెట్టారని అవన్నీ ఎలా వచ్చాయో తమకు వివరించాని నోటీసులో పేర్కొన్నారు. యాదాద్రి జిల్లాలోని భువనగిరిలో గల నయీం ఇంటికి ఈ నోటీసులు అంటించారు. ప్రస్తుతం ఆ ఇంట్లో ఎవరూ లేరని తెలుస్తోంది.  తెలంగాణలో నయీం కేసు పెద్ద సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే.

నయీం ఎన్‌కౌంటర్‌ తర్వాత కాస్త హడావిడి చేసిన సిట్‌ పోలీసులు ఆ తర్వాత కేసు విషయంలో కాస్త నిశ్శబ్ద వాతావరణం నెలకొంది. కొద్ది రోజులుగా ఈ కేసు గురించి పెద్దగా చర్చ లేదు. అయితే, తాజాగా నయీం భార్యకు, తల్లికి, సోదరీమణులకు నోటీసులు పంపించారు.

మొత్తం 26చోట్ల నయీం ఆస్తులు గుర్తించామని, వాటిల్లో బినామీలు నయీం భార్య, తల్లి, సోదరీమణులు ఉన్నట్లు తాము గుర్తించామని పేర్కొన్న ఐటీ అధికారులు వారి నుంచి వివరాలు కోరారు. మరి ఆదాయపన్ను శాఖ అధికారులు ఈ కేసులో ఏమేరకు ఆస్తులను గుర్తిస్తారో అన్నది చూడాల్సి ఉంది. 

 

మరిన్ని తాజా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

 

 

click me!