హత్య చేసిన మరుసటి రోజే సాయికృష్ణే ఇంటికి వచ్చి.. భద్రాచలం బస్సు ఎక్కించానని చెప్పాడు : అప్సర తల్లి

By SumaBala Bukka  |  First Published Jun 9, 2023, 1:31 PM IST

మహిళను చంపి మ్యాన్ హోల్ లో పూడ్చిన కేసులో మృతురాలు అప్సర తల్లి తన కూతురు కోయంబత్తూరు వెడుతున్నానని చెప్పి వెళ్లిందని చెప్పారు. 

హైదరాబాద్ : హైదరాబాద్ శంషాబాద్ లో కలకలం సృష్టించిన అప్సర హత్య కేసులో మరో విషయం వెలుగు చూసింది. అప్సర తల్లి మాట్లాడుతూ... ‘అప్సర మూడో తేదీ కోయంబత్తూర్ వెడతానని చెప్పి వెళ్లింది. తరువాత ఫోన్ కలవలేదు. దీంతో స్నేహితుడైన సాయికృష్ణకు పదే పదే ఫోన్లు చేసినా ఎత్తలేదు. ఆ తరువాత ఆదివారం సాయికృష్ణ మా ఇంటికి వచ్చాడు. అప్సర స్నేహితులతో భద్రాచలం వెడతానంటే తానే భద్రాచలం పంపించానని చెప్పాడు. నువ్వెలా పంపిస్తావు.. నీకేం అధికారం ఉందని.. సీసీ టీవీ ఫుటేజ్ చెక్ చేద్దాం పదా అన్నా.. దానికి సమాధానం దాట వేశాడు. 

తన కూతురు పదిహేనేళ్ల క్రితం తమిళ సినిమాలో ఒ చిన్న పాత్ర వేసింది. సినిమాలు వద్దని ఇంటికి తీసుకువచ్చేశాం. ఇంట్లోనే ఉంటుంది. గుడికి వెళ్లే క్రమంలో సాయికృష్ణతో పరిచయం ఏర్పడింది. మేము మొదట్లో చెన్నైలో ఉండేవాళ్లం. ఆ తరువాత సొంత ప్రాంతం అని హైదరాబాద్ కు వచ్చి స్థిరపడ్డాం. మా భర్త కాశీలో ఉంటాడు. అతను పంపించే డబ్బులతో మేము హాయిగా ఉంటున్నాం...’ అని చెప్పుకొచ్చారు. 

Latest Videos

హైదరాబాద్ శంషాబాద్ లో దారుణం.. ప్రియురాలిని చంపి మ్యాన్ హోల్ లో దాచిపెట్టిన ప్రియుడు..

సాయికృష్ణ, అప్సర స్నేహితులు.. మంచిపిల్లాడు, మన బ్రాహ్మణ పిల్లాడే కదా అనుకున్నాం.. కానీ ఇలా చేస్తాడని తెలియదు. కానీ అతను ఆదివారం వచ్చి చెప్పడంతో అనుమానం వచ్చింది. ఇంట్లో అమ్మాయికి పెళ్లి సంబంధాలు ఏమీ చూడడం లేదు. తన కూతురు పదిహేనేళ్ల క్రితం తమిళ సినిమాలో ఒ చిన్న పాత్ర వేసింది. సినిమాలు వద్దని ఇంటికి తీసుకువచ్చేశాం. ఇంట్లోనే ఉంటుంది. గుడికి వెళ్లే క్రమంలో సాయికృష్ణతో పరిచయం ఏర్పడింది. మేము మొదట్లో చెన్నైలో ఉండేవాళ్లం. ఆ తరువాత సొంత ప్రాంతం అని హైదరాబాద్ కు వచ్చి స్థిరపడ్డాం. మా భర్త కాశీలో ఉంటాడు. అతను పంపించే డబ్బులతో మేము హాయిగా ఉంటున్నాం...’ అని చెప్పుకొచ్చారు. 

అంతేకాదు తమ కులస్తుడే కాబట్టి తాము అనుమానించలేదని.. ఒక పురోహితుడు ఇలా చేయగలడని ఎవరైనా ఊహిస్తారా అని ఆవేదన వ్యక్తం చేశారు. ఇక గుడికి ఎవరైనా ఎలా వస్తారని ప్రశ్నించారు. తనకు కూతురు చనిపోయిన సంగతి తెలియదన్నారు. వారిద్దరి మధ్య వివాహేతర సంబంధం లేదని చెప్పుకొచ్చారు. సాయికృష్ణ కేవలం స్నేహితుడేనని అన్నారు. ఇద్దరి మధ్య పరిచయం ఉందని సాయికృష్ణ తండ్రి అంటున్నాడంటే.. సాయికృష్ణ ఆయన తండ్రికి అన్నీ చెబుతున్నాడనా అని ప్రశ్నించారు. 

కూతురు కనిపించకపోవడంతో సాయి కృష్ణకు ఎన్నిసార్లు ఫోన్ చేసినా, ఇక్కడున్నా, అక్కడున్నా అంటూ సమాధానం చెప్పాడని ఆదివారం ఇంటికి వచ్చాడని.. అతడిని నిలదీస్తే.. లేదు అత్తయ్యగారూ...నన్ను అనుమానిస్తున్నారా? అంటూ అడిగాడు. పోలీసులు దీనిమీద మరింత దర్యాప్తు చేస్తున్నారు. 

అప్సర ఎవరో మాకు తెలియదు, నా కొడుకు మంచోడు: సాయికృష్ణ తండ్రి

కాగా సాయికృష్ణ చాలామంచి వ్యక్తి అని.. అతని మీద ఎవ్వరికీ అనుమానం వచ్చేలా ఉండేవాడు కాదని.. అతను అందరితో చాలా బాగా ఉంటాడని స్థానికులు చెబుతున్నారు. ఈ ఘటనతో అందరూ షాక్ అయ్యారు. ఎమ్మార్వో కూడా ఈ విషయం మీద మాట్లాడుతూ.. సాయికృష్ణ ఈ ప్రాంతంలో అందరికీ తెలిసిన వ్యక్తి అని.. ఎవ్వరూ అతడిని అనుమానించలేదని.. ఇలా జరిగిందని తెలియడంతో అందరూ షాక్ అయ్యారని తెలిపారు. 

click me!