అప్సర ఎవరో తనకు తెలియదని సాయికృష్ణ తండ్రి చెప్పారు. అమ్మాయిల విషయంలో జాగ్రత్తగా ఉండాలని తాను ఎప్పుడూ చెప్పేవాడినని ఆయన చెప్పారు.
హైదరాబాద్:అప్సర ఎవరో తమకు తెలియదని సాయికృష్ణ తండ్రి మీడియాకు చెప్పారు. శుక్రవారంనాడు పలు మీడియా సంస్థలతో సాయికృష్ణ తండ్రి మాట్లాడారు. తన కొడుకు వ్యక్తిత్వం చాలా మంచిదన్నారు. తన కొడుకు కు వివాహమై నాలుగేళ్ల పాప కూడ ఉందన్నారు. హత్యకు గురైన అప్సర ఎవరో తనకు తెలియదన్నారు. ఒకసారి తాను గుడిలో అప్సరను చూసినట్టుగా సాయికృష్ణ తండ్రి చెప్పారు. అమ్మాయిల విషయంలో జాగ్రత్తగా ఉండాలని తన కొడుకుతో సహా అక్కడ ఉన్నవారికి వివరించినట్టుగా సాయికృష్ణ తండ్రి తెలిపారు. భక్తి, గుడి ,దేవాలయాల్లో పూజలు వంటి కార్యక్రమాలు తప్ప ఇతర విషయాలు తన కొడుకుకు తెలియవన్నారు. దేవాలయాలకు విరాళాల కోసం తన కొడుకు దాతల వద్దకు వెళ్తుంటారని సాయికృష్ణ తండ్రి చెప్పారు.
తన కొడుకుకు చెందిన స్నేహితులు విదేశాల నుండి వచ్చిన సమయంలో ఆలస్యంగా ఇంటికి వస్తుంటాడన్నారు. ఈ నెల 3వ తేదీ ఆలస్యంగా ఇంటికి వచ్చినట్టుగా చెప్పారు. ఈ ఘటన జరిగిన తర్వాత తన కొడుకు అదృశ్యం కాలేదన్నారు. కాకపోతే గత రెండు రోజులుగా తన కొడుకు ముభావంగా ఉంటున్నాడని సాయికృష్ణ తండ్రి వివరించారు.
also read:శంషాబాద్ లో దారుణం: ప్రియురాలి హత్య, మ్యాన్ హోల్ లో డెడ్ బాడీ
ఈ నెల 3వ తేదీన శంషాబాద్ లో వివాహిత అప్సర ను హత్య చేసిన పూజారి సాయికృష్ణ సరూర్ నగర్ తహసీల్దార్ కార్యాలయంలోని మ్యాన్ హోల్ లో పూడ్చిపెట్టాడు. ఆ తర్వాత అప్సర కన్పించడం లేదని శంషాబాద్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఈ ఫిర్యాదు ఆధారంగా పోలీసులు విచారణ నిర్వహిస్తున్నారు. సాయికృష్ణను పోలీసులు అదుపులోకి తీసుకొని ప్రశ్నించిన సమయంలో అసలు విషయం వెలుగు చూసింది.