కేంద్రం అలా... రాష్ట్రం ఇలా : తెలంగాణలో కరోనా న్యూ వేరియంట్ గందరగోళం

By Arun Kumar P  |  First Published Dec 26, 2023, 9:57 AM IST

తెలంగాణలో కరోనా న్యూ వేరియంట్ కేసులు వున్నాయని కేంద్ర ప్రభుత్వం అంటోంది... లేవని రాష్ట్ర ప్రభుత్వం అంటోంది. ఎవరు చెప్పేదో నిజమో తెలియక ప్రజలు గందరగోళానికి గురవుతున్నారు. 


కరీంనగర్ : ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా న్యూ వేరియంట్ జేఎన్.1 తెలంగాణకు చేరింది. కరీంనగర్ లోని ఓ హాస్పిటల్లో పనిచేసే నర్స్, పెద్దపల్లికి చెందిన మరో మహిళ కరోనా లక్షణాలతో బాధపడుతుండటంతో వారికి టెస్టులు చేసారు. ఈ క్రమంలో వారు కరోనాబారిన పడ్డట్లు తేలడంతో ఇదేమైనా కొత్త వేరియంటా అన్న అనుమానంతో మరిన్ని టెస్టులకోసం శాంపిల్స్ గాంధీ హాస్పిటల్ కు తరలించారు. వాటిని టెస్ట్ చేయగా కొత్త వేరియంట్ జెఎన్.1  గా నిర్దారణ అయినట్లు తెలుస్తోంది.

అయితే తెలంగాణ వైద్యారోగ్య శాఖ మాత్రం రాష్ట్రంలో కరోనా సబ్ వేరియంట్ జేఎన్.1 కేసులేవీ తెలంగాణలో లేవని చెబుతోంది. ఈ మేరకు తెలంగాణ హెల్త్ డెరెక్టర్ రవీంద్ర నాయక్ ఓ ప్రకటన చేసారు. కానీ కేంద్ర ప్రభుత్వం మాత్రం తెలంగాణలో రెండు జేఎన్.1 కేసులు నమోదయినట్లుగా పేర్కొంటోంది. ఏయే రాష్ట్రాల్లో ఎన్ని జేఎన్.1 కేసులున్నాయో తెలియజేస్తే కేంద్ర ఆరోగ్య శాఖ హెల్త్ బులెటిన్ విడుదల చేసింది. ఇందులో తెలంగాణలోనూ న్యూ వేరియంట్ కేసులున్నట్లు పేర్కోంది.  

Latest Videos

ఇలా కరోనా న్యూ వేరియంట్ విషయంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ప్రకటనలతో ప్రజల్లో గందరగోళం నెలకొంది. ఏదేమైనా కరోనా వ్యాప్తి మళ్లీ పెరుగుతున్న నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా వుండాలని వైద్య నిపుణులు సూచిస్తున్నారు. గతంలో మాదిరిగా కరోనా వ్యాప్తిని నివారించేందుకు మాస్కులు ధరించాలనిశానిటైజర్లు వాడాలని సూచించారు. అవసరం అయితేనే ఇళ్లలోంచి బయటకు వెళ్లాలని... ప్రజలు గుమిగూడే ప్రాంతాలకు వెళ్లకుండా వుండటమే మంచిదని అంటున్నారు.  

click me!