శ్రీశైలంలో విద్యుత్ ఉత్పత్తి నిలిపివేసేలా ఆదేశాలివ్వాలి:తెలంగాణపై కేఆర్ఎంబీకి ఏపీ ఫిర్యాదు

By narsimha lode  |  First Published Sep 30, 2022, 5:05 PM IST

శ్రీశైలం ప్రాజెక్టులో విద్యుత్ ఉత్పత్తిని నిలిపివేసేలా తెలంగాణ  ప్రభుత్వాన్ని ఆదేశించాలని కోరతూ ఏపీ ప్రభుత్వం ఇవాళ కేఆర్ఎంబీకి లేఖ రాసింది. 


అమరావతి: శ్రీశైలంలో విద్యుత్  ఉత్పత్తిని నిలిపివేసేలా తెలంగాణను ఆదేశించాలని కోరుతూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం శుక్రవారం నాడు కృష్ణా రివర్ మేనేజ్ మెంట్ బోర్డు కు లేఖ రాసింది. శ్రీశైలంలో తెలంగాణ ప్రభుత్వం విద్యుత్ ను ఉత్పత్తి చేయడంతో నీరు వృధాగా సముద్రంలోకి వెళ్తుందని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం  చెబుతుంది. ప్రస్తుతం ప్రాజెక్టులో ఉన్న నీటిని విద్యుత్ ఉత్పత్తి పేరుతో ఉపయోగిస్తే  రానున్న రోజుల్లో తాగు, సాగునీటికి ఇబ్బంది ఏర్పడే  అవకాశం ఉందని ఏపీ ప్రభుత్వం చెబుతుంది. 

ప్రస్తుత సీజన్ లో కృష్ణా పరివాహక ప్రాంతంలో భారీ వర్షాలు కురిశాయి.  దీంతో శ్రీశైలం, నాగార్జున సాగర్ ప్రాజెక్టులు నిండాయి. ప్రాజెక్టులకు ఎగువ నుండి వరద వస్తున్న నేపథ్యంలో విద్యుత్ ఉత్పత్తి ప్రారంభించింది తెలంగాణ ప్రభుత్వం. అయితే విద్యుత్ ఉత్పత్తి పేరుతో ప్రాజెక్టులో నీటిని దిగువకు వృధాగా విడుదల చేస్తున్నారని ఏపీ ప్రభుత్వం అభ్యంతరం తెలుపుతుంది. 

Latest Videos

also read:ఏపీ అక్రమంగా కృష్ణా జలాలను తరలిస్తోంది .. ఆ అనుమతులు నిలిపివేయండి: కేఆర్ఎంబీకి తెలంగాణ లేఖ

గతంలో కూడ విద్యుత్ ఉత్పత్తిని నిలిపివేసేలా ఆదేశాలు ఇవ్వాలని ఏపీ ప్రభుత్వం కేఆర్ఎంబీకి లేఖలు రాసింది. నీటి ప్రాజెక్టుల విషయంలో రెండు రాష్ట్రాలు ఇటీవల కాలంలో పరస్పరం ఫిర్యాదులు చేసుకొంటున్నాయి. కృష్ణా, గోదావరి నదులపై నిర్మించిన ప్రాజెక్టుల విషయమై రెండు రాష్ట్రాలు పరస్పర్ ఫిర్యాదులు చేసుకుంటున్నాయ. ఈ ఏడాది జూలైలో గోదావరికి వచ్చిన వరద కారణంగా పోలవరంపై తెలంగాణ ప్రభుత్వం ఏపీపై పిర్యాదులు చేసింది.  పోలవరం బ్యాక్ వాటర్ పై  సమగ్రంగా అధ్యయనం చేయాలని కేంద్ర ప్రభుత్వాన్ని తెలంగాణ కోరుతుంది. 

కృష్ణా నదిపై ఏపీ ప్రభుత్వం నిర్మిస్తున్న రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టుపై తెలంగాణ అభ్యంతరం చెబుతుంది. పాలమూరు రంగారెడ్డి లిఫ్ట్  ఇరిగేషన్, సీతారామ వంటి ప్రాజెక్టులపై ఏపీ ప్రభుత్వం అభ్యంతరం తెలుపుతుంది. 

click me!