అమిత్‌షాతో కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి భేటీ... మునుగోడులో పరిస్ధితులపై ఆరా

By Siva KodatiFirst Published Sep 30, 2022, 4:37 PM IST
Highlights

కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో మాజీ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి భేటీ అయ్యారు. ఈ సందర్భంగా మునుగోడు ఉపఎన్నిక నేపథ్యంలో తాజా రాజకీయ పరిస్థితిని అమిత్ షాకు వివరించారు.

కేంద్ర హోంమంత్రి అమిత్ షాను కలిశారు మాజీ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి. మునుగోడు ఉపఎన్నిక నేపథ్యంలో తాజా రాజకీయ పరిస్థితిని అమిత్ షాకు వివరించారు. ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి.. రాజగోపాల్ రెడ్డి బీజేపీలో చేరడంతో అక్కడ ఉపఎన్నికలు అనివార్యమైన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో నియోజకవర్గంలోని పరిస్ధితులను అమిత్ షాకు వివరించానన్నారు రాజగోపాల్ రెడ్డి. 

ఇకపోతే.. మునుగోడు ఉపఎన్నికకు కేంద్ర ఎన్నికల సంఘం కసరత్తు చేస్తున్నట్టుగా తెలుస్తోంది. ఇంకా ఉప ఎన్నిక నోటిఫికేషన్ వెలువడకపోయినప్పటికీ.. ఈ ఎన్నికలో విజయం సాధించడమే లక్ష్యంగా టీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్‌ పార్టీలు పావులు కదుపుతున్నాయి. అయితే తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం.. నవంబర్ రెండో వారంలో మునుగోడు ఉప ఎన్నిక నిర్వహించాలని ఈసీ భావిస్తున్నట్టుగా తెలుస్తోంది. హిమాచల్ ప్రదేశ్, గుజరాత్ అసెంబ్లీ ఎన్నికలతో పాటే మునుగోడు ఉప ఎన్నికను నిర్వహించేందుకు కసరత్తు చేస్తోంది.

ALso REad:మునుగోడు ఉప ఎన్నికకు ఈసీ కసరత్తు.. నవంబర్ రెండో వారంలో పోలింగ్..?

ఆగస్టు 8వ తేదీన రాజగోపాల్ రెడ్డి తన రాజీనామా లేఖను స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డికి అందజేశారు. అదే రోజు రాజగోపాల్ రెడ్డి రాజీనామాకు స్పీకర్ ఆమోదం తెలిపారు. ఇక, నిబంధనల ప్రకారం.. ఆరు నెలలు అంటే ఫిబ్రవరి 8వ తేదీలోపు మునుగోడు స్థానానికి ఉప ఎన్నిక జరగాల్సి ఉంది. అయితే నవంబర్‌లోనే మునుగోడు ఉప ఎన్నిక నిర్వహించేందుకు కేంద్ర ఎన్నికల సంఘం కసరత్తు చేస్తున్నట్టుగా వార్తలు వెలువడుతున్నాయి. 

మునుగోడు ఉప ఎన్నికకు సంబంధించి రాష్ట్ర ప్రధాన ఎన్నికల కమిషనర్ కార్యాలయం నుంచి కేంద్ర ఎన్నికల సంఘం ఇప్పటికే వివరాలను తెప్పించుకుందని సమాచారం. అలాగే.. రాష్ట్ర ఎన్నికల అధికారులతో ఏర్పాట్లను సమీక్షించిందని, ఈవీఎంలు, ఇతర ఎన్నికల సామాగ్రిని కూడా సిద్దంగా ఉంచుకోవాలని కోరినట్టుగా తెలుస్తోంది. ఈ క్రమంలోనే .ఉప ఎన్నికకు సన్నాహాలు ప్రారంభించాలని తెలంగాణ ఎన్నికల అధికారులు నల్గొండ కలెక్టర్‌ను ఆదేశించారని సమాచారం. 

ఇక, అక్టోబర్ మొదటి వారంలో హిమాచల్ ప్రదేశ్, గుజరాత్ అసెంబ్లీ ఎన్నికలతో పాటు మునుగోడు ఉప ఎన్నికకు కేంద్ర ఎన్నికల సంఘం నోటిఫికేషన్ జారీ చేసే అవకాశం ఉందని మీడియా కథనాలు పేర్కొన్నాయి. 

click me!