గ్యాంగ్ స్ఠర్ నయీం అనుచరుడు శేషన్న: కస్టడీ కోరుతూ నాంపల్లి కోర్టులో పోలీసుల పిటిషన్

By narsimha lodeFirst Published Sep 30, 2022, 4:12 PM IST
Highlights


గ్యాంగ్ స్టర్ నయీం ప్రధాన అనుచరుడు శేషన్న కస్డడీ కోరుతూ హైద్రాబాద్ పోలీసులు నాంపల్లి కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. మూడు రోజుల క్రితం పోలీసులు శేషన్నను హైద్రాబాద్ లో అరెస్ట్ చేశారు. 

హైదరాబాద్:గ్యాంగ్‌స్టర్ నయీం ప్రధాన అనుచరుడు శేషన్నను నాలుగు రోజుల కస్టడీ కోరుతూ హైద్రాబాద్ పోలీసులు నాంపల్లి కోర్టులో శుక్రవారం నాడు పిటిషన్ దాఖలు చేశారు. హైద్రాబాద్ కొత్తపేటలో సెటిల్ మెంట్ చేస్తున్న సమయంలో శేషన్నను పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించారు. నయీంకు చెందిన  సెటిల్ మెంట్లలో  శేషన్న ప్రధాన భూమిక పోషించాడని పోలీసులు గుర్తించారు. నయీంకు ఏకే 47 ఎక్కడి నుండి వచ్చిందనే విసయమై పోలీసులు దర్యాప్తు చేయనున్నారు. శేషన్న ఆధీనంలోని యాక్షన్ టీంలో ఎందరున్నారు, వారంతా ఎక్కడున్నారనే విసయమై కూడ పోలీసులు దర్యాప్తు చేయనున్నారు.ఈ విషయాలపై పూర్తి సమాచారం రావాలంటే శేషన్నను విచారించాలని పోలీసులు భావిస్తున్నారు. జైల్లో ఉన్న శేషన్నను కస్టడీలోకి తీసుకోవాలని పోలీసులు భావిస్తున్నారు. నాలుగు రోజుల పాటు కస్టడీకి ఇవ్వాలని నాంపల్లి కోర్టులో పోలీసులు ఇవాళ పిటిషన్ దాఖలు చేశారు. 

also read:నయీం అనుచరుడు శేషన్నకి 14 రోజుల రిమాండ్.. చంచల్‌గూడకి తరలింపు

2016లో ఆగస్టు 16న షాద్ నగర్ లో నయీం ఎన్ కౌంటర్ తర్వాత శేషన్న కన్పించకుండా పోయాడు. నయీం, శేషన్నలు ఇద్దరూ పీపుల్స్ వార్ లో పనిచేశాడు. వీరిద్దరూ జనజీవన స్రవంతిలో చేరిన తర్వాత ఒకప్పటి పీపుల్స్ వార్ ప్రస్తుత మావోయిస్టు పార్టీకి వ్యతిరేకంగా పనిచేశారు. మావోయిస్టుల ఆచూకీని పోలీసులకు ఇవ్వడంతో పాటు హక్కుల సంఘాల నేతల హత్య కేసులు శేషన్నపై ఉన్నాయి. 
 

click me!