హరికృష్ణ మృతి... చంద్రబాబు కాన్వాయ్ లోనే ఆస్పత్రికి చేరుకున్న తెలంగాణ మంత్రి

By Arun Kumar PFirst Published Aug 29, 2018, 12:29 PM IST
Highlights

తన బావమరిది, టిడిపి మాజీ ఎంపి హరికృష్ణ మృతదేహానికి ఆంధ్ర ప్రదేశ్ సీఎం చంద్రబాబు నివాళులు అర్పించారు. అమరావతి నుండి ప్రత్యేక హెలికాప్టర్ లో ఆయన నల్గొండ కు చేరుకున్నారు. అక్కడే ఆయన్ని రిసీవ్ చేసుకున్న తెలంగాణ మంత్రి జగదీష్ రెడ్డి సీఎం కాన్వాయ్ లోనే నార్కట్ పల్లి కామినేనికి చేరుకున్నారు. 

టిడిపి మాజీ ఎంపి, సినీ నటుడు నందమూరి హరికృష్ణ ఇవాళ తెల్లవారుజామున జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతిచెందారు. నల్గొండ జిల్లాలో గుంటూరు హైవేపై ప్రయాణిస్తూ కారు అదుపుతప్పడంతో ఈ ప్రమాదం జరిగింది. దీంతో తీవ్రగాయాలపాలైన ఆయన్ని నార్కట్ పల్లి లోని కామినేని ఆస్పత్రికి తరలించినా ఫలితం లేకుండా పోయింది. చికిత్స పొందుతూ ఆయన మృతి చెందారు.

ఈ వార్త తెలుసుకున్న నందమూరి కుటుంబసభ్యులతో పాటు నారా వాటి కుటుంబం కూడా నార్కట్ పల్లికి చేరుకున్నారు. బావమరిది మరణ వార్త తెలుసుకుని ఏపి సీఎం చంద్రబాబు కూడా హుటాహుటిన నల్గొండకు బయలుదేరారు. తనయుడు లోకేష్ తో కలిసి హెలికాప్టర్‌లో అమరావతి నుండి నేరుగా నల్గొండకు చేరుకొన్నారు. అక్కడి నుండి ప్రత్యేక కాన్వాయ్ లో సీఎం చంద్రబాబునాయుడు కామినేని ఆసుపత్రికి చేరుకొన్నారు.

అయితే ఏపి సీఎం కాన్యాయ్ లోనే తెలంగాణ మంత్రి జగదీష్ రెడ్డి కూడా నార్కట్ పల్లికి చేరుకున్నారు. చంద్రబాబు, లోకేష్ లతో పాటే ఆయన కూడా హరికృష్ణ మృతదేహానికి నివాళులు అర్పించారు.

 ఇప్పటివరకు చంద్రబాబు రాకకోసం ఎదురుచూసిన వైద్యులు ఆయన సందర్శించిన వెంటనే మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. పోస్టుమార్టం తర్వాత హరికృష్ణ పార్థీవ దేహాన్ని ఎన్టీఆర్ భవన్ కు తరలించనున్నారు. ఎన్టీఆర్ భవన్ లో పార్టీ నాయకులు,కార్యకర్తలు, సామాన్య ప్రజలు, అభిమానులు నివాళులర్పించేలా పార్టీ యంత్రాంగం ఏర్పాట్లు చేసింది. ఎన్టీఆర్ భవన్ లో నివాళుల తర్వాత హరికృష్ణ ఇంటికి పార్థీవదేహన్ని తీసుకెళ్లనున్నారు. 

హరికృష్ణ మృతి: కారు ప్రమాదం ఎలా జరిగింది?

పోస్ట్ మార్టం పూర్తి..రేపే అంత్యక్రియలు.. ఎక్కడంటే

వర్షాలకు పాడైన రోడ్డు...అందువల్లే ప్రమాద తీవ్రత ఎక్కువగా ఉంది : నల్గొండ ఎస్పీ

తెలుగుభాషకు ప్రాధాన్యత ఇచ్చిన హరికృష్ణ
 

click me!