‘అందరికీ సద్దుల బతుకమ్మ పండుగ శుభాకాంక్షలు’.. తెలుగులో ఏ ఆర్ రెహమాన్ ట్వీట్

By AN TeluguFirst Published Oct 14, 2021, 10:00 AM IST
Highlights

 తెలంగాణ మహిళలంతా  ఉల్లాసంగా, ఆనందంగా జరుపుకోవాలని ఆకాంక్షిస్తున్నాను అంటూ ఇంగ్లీషులో ట్వీట్ చేశారు ఎఆర్ రెహమాన్. దీనికి హాష్ ట్యాబ్ బతుకమ్మ, bathukamma  అని ఇంగ్లీషులోనూ, తెలుగులోనూ ట్యాగ్ కూడా ఇచ్చారు. 

ప్రముఖ సంగీత దర్శకుడు AR Rahman తెలంగాణ ప్రజలకు బతుకమ్మ పండుగ శుభాకాంక్షలు తెలిపారు. అదికూడా తెలుగులో ‘అందరికీ సద్దుల బతుకమ్మ పండుగ శుభాకాంక్షలు’ అంటూ ట్వీట్ చేయడం చర్చనీయాంశంగా మారింది. 

ఆడపడుచులందరూ ఒక్కదగ్గరికి చేరి, కలిసి మెలిసి చేసుకునే పండుగ బతుకమ్మ. ఈ పండుగలో పూలతో బతుకమ్మను పేర్చి ఆటపాటలతో, ఆత్మీయతలు కలబోసుకుంటారు. ఈ సంతోషకరమైన సందర్బాన్ని తెలంగాణ మహిళలంతా  ఉల్లాసంగా, ఆనందంగా జరుపుకోవాలని ఆకాంక్షిస్తున్నాను అంటూ ఇంగ్లీషులో ట్వీట్ చేశారు ఎఆర్ రెహమాన్. దీనికి హాష్ ట్యాబ్ బతుకమ్మ, bathukamma  అని ఇంగ్లీషులోనూ, తెలుగులోనూ ట్యాగ్ కూడా ఇచ్చారు. 

కాగా, తెలంగాణలో బతుకమ్మకి ఉన్న ప్రత్యేకత అందరికి తెలిసిందే. దసరా పండుగ సందర్భంగా పది రోజులపాటు సాగే ఈ బతుకమ్మ పండుగకి ప్రత్యేకతని తీసుకొచ్చారు ఆస్కార్ మ్యూజిక్‌ డైరెక్టర్ ఏ. ఆర్‌ రెహ్మాన్. తెలంగాణ జాగృతి సారథ్యంలో బతుకమ్మ పాటని తీసుకొచ్చారు. `అల్లిపూల వెన్నెల` పేరుతో ప్రత్యేకంగా బతుకమ్మ పాటని రూపొందించారు. ఇందులో ప్రముఖ దర్శకుడు గౌతమ్‌ మీనన్‌ కూడా భాగం కావడం విశేషం. ఈ నెల ప్రారంభంలో ఈ పాటని విడుదల చేశారు. ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత, దర్శకుడు గౌతమ్‌ మీనన్‌ సంయుక్తంగా అక్టోబర్ 5న దీన్ని ఆవిష్కరించారు. 

తెలంగాణ ఆడపడుచల పండుగ బతుకమ్మ మరోసారి విశ్వయవనికపై మెరవనుంది. ప్రపంచం మెచ్చిన సంగీత దర్శకుడు, ఆస్కార్ అవార్డు గ్రహీత a r rehman సంగీత సారథ్యంలో బతుకమ్మ పాట `అల్లిపూల వెన్నెల` గా సరికొత్త సొబగులు అద్దుకుంది. బతుకమ్మ ఆట, పాటను తెలంగాణ ఆత్మగౌరవ పతాకంగా లోకానికి పరిచయం చేసిన తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు mlc kavitha ఎంతో ప్రతిష్టాత్మకంగా ఈ పాటను నిర్మించారు. 

ప్రఖ్యాత దర్శకుడు gautam menon దర్శకత్వం వహించిన ఈ పూల సింగిడిని ఇవాళ దర్శకుడు గౌతమ్ వాసుదేవ మీనన్ తో కలిసి ఎమ్మెల్సీ కవిత తన నివాసంలో విడుదల చేశారు. ఉత్తరా ఉన్నికృష్ణన్ పాడిన ఈ పాటకు ప్రముఖ రచయిత మిట్టపల్లి సరేందర్ లిరిక్స్ అందించగా,  జాతీయ అవార్డు గ్రహీత బ్రిందా కొరియోగ్రఫీ చేశారు. అక్టోబర్ 6 నుండి తొమ్మిది రోజుల పాటు బతుకమ్మ పండుగ విశ్వవ్యాప్తంగా ఘనంగా జరగనుంది. 

రెహ్మాన్‌ సారథ్యంలో బతుకమ్మ పాట `అల్లిపూల వెన్నెల`.. ఆవిష్కరించిన ఎమ్మెల్సీ కవిత, గౌతమ్‌మీనన్‌

తెలంగాణ ఆడబిడ్డలు ఎంతో సంబురంగా జరుపుకునే ఈ పండుగకు `అల్లిపూల వెన్నెల`  మరింత శోభను తీసుకొస్తుంది. ఈ పాటను తెలంగాణలోని వివిధ లొకేషన్లలో ఎంతో అందంగా చిత్రీకరించారు.  పాటను విడుదల చేసిన సందర్భంగా, సంగీత దర్శకుడు ఏఆర్ రెహమాన్ ట్విట్ చేశారు. బతుకమ్మ శుభాకాంక్షలు తెలిపారు. 

తెలంగాణలో మాత్రమే జరుపుకునే ప్రత్యేకమైన పూల పండుగ బతుకమ్మ. తెలంగాణ సాంస్కృతిక ప్రతీక బతుకమ్మ పండుగ. బతుకమ్మ పండుగను విశ్వవ్యాప్తం చేయడంలో ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ఆధ్వర్యంలోని తెలంగాణ జాగృతి కీలక పాత్ర పోషించింది. ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఉద్యమ సమయం నుండి తెలంగాణ సాంస్కృతి, సాంప్రదాయాలను కాపాడటంలో తెలంగాణ జాగృతి కీలక పాత్ర పోషించింది.
 

click me!