మదన్ ద్వారానే విశాఖపట్నానికి చెందిన సాంబశివరావు తో సంప్రదింపులు జరిపారు. మధ్యవర్తిత్వం నిర్వహించేలా ఏర్పాట్లు చేశారు. మీరు ఎప్పుడూ షిరిడి వెళ్లిన అక్కడ అవసరమైన సౌకర్యాలు కల్పించే వాడు. ముగ్గురు కలిసి రూ.64.05 కోట్ల విలువైన Fixed Deposits కొట్టేసేందుకు పక్కా ప్రణాళిక రూపొందించారు.
తెలుగు అకాడమీ ఫిక్స్డ్ డిపాజిట్ల గోల్మాల్ వ్యవహారంలో శిరిడీ కి చెందిన మదన్ ను నగర్ సైబర్ క్రైమ్ పోలీసులు గురువారం రాత్రి అరెస్టు చేశారు. కేసులో నిందితురాలు, కెనరా బ్యాంకు మాజీ మేనేజర్ సాధన భర్త బాబ్జీకి 41వ సీఆర్పీసీ కింద నోటీసులు ఇచ్చారు. తాజాగా అరెస్టయిన మదన్ కీలక నిందితుడు సాయి కుమార్ కు ప్రాణస్నేహితుడు.
మదన్ ద్వారానే విశాఖపట్నానికి చెందిన సాంబశివరావు తో సంప్రదింపులు జరిపారు. మధ్యవర్తిత్వం నిర్వహించేలా ఏర్పాట్లు చేశారు. మీరు ఎప్పుడూ షిరిడి వెళ్లిన అక్కడ అవసరమైన సౌకర్యాలు కల్పించే వాడు. ముగ్గురు కలిసి రూ.64.05 కోట్ల విలువైన Fixed Deposits కొట్టేసేందుకు పక్కా ప్రణాళిక రూపొందించారు.
undefined
గతేడాది డిసెంబర్ లోనే Telugu Akademi సొమ్ము కాజేసేందుకు తెలివిగా వ్యూహరచన చేశారు. ఆ తర్వాత తమకు అనుకూలమైన వ్యక్తుల సహకారంతో వ్యవహారం నడిపించారు. కోట్లాది రూపాయలు చేతికి అందగానే వాటాలు పంచుకున్నారు. ఆ తర్వాత భారీగా Assets కూడబెట్టారు.
కేసును సవాల్ గా తీసుకున్న సిసిఎస్ పోలీసులు అన్ని కోణాల్లో దర్యాప్తు ప్రారంభించారు. రూ.64.05 కోట్లలో ఇప్పటివరకు రూ. 20 కోట్లు స్వాధీనం చేసుకుని 17 మందిని అరెస్టు చేశారు. ఇకనుంచి accusedకు సహకరించిన కొందరు అజ్ఞాతంలోకి వెళ్ళినట్లు తెలుస్తుంది.
సిసిఎస్ పోలీసులు మాత్రం కేసుతో ప్రమేయం ఉన్న ఏ ఒక్కరిని వదలమని స్పష్టం చేస్తున్నారు. AP, Telanganaకు చెందిన మరి కొందరిని అరెస్టు చేసేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఈ కేసులో కీలకమైన ఆధారాలు రాబట్టేందుకు Sambhasivarao కస్టడీకి కోరుతూ న్యాయస్థానంలో పిటిషన్ దాఖలు చేయనున్నట్లు సమాచారం.
ఏపీ ఫిక్స్‌డ్ డిపాజిట్ల స్కామ్: ఇద్దరు అరెస్ట్.. నిందితుల్లో ఒకరు ఐవోబీ మాజీ మేనేజర్
రిజిస్ట్రేషన్లు చేయొద్దంటూ లేఖ…
Telugu Akademi Fixed Deposits గోల్ మాల్ కేసులో సిసిఎస్ పోలీసులు రూ. 20 కోట్లు తిరిగి రాబట్టారు. ఇందులో రూ. మూడు కోట్ల నగదు, రూ. 16 కోట్ల విలువైన స్తిర, చరాస్తులు ఉన్నాయి. ఆస్తిపాస్తుల క్రయ విక్రయాలు జరగకుండా ఏపీ, తెలంగాణ స్టాంపులు/ రిజిస్ట్రేషన్ శాఖకు లేఖ రాయనున్నారు.
గుర్తించిన ఆస్తులు ఇవే…
కేసులో కీలక సూత్రధారి సాయికుమార్ పెద్ద అంబర్పేట్ Outer Ring Road సమీపంలో రూ. వంద కోట్ల విలువైన 30 ఎకరాల భూమిని కొనుగోలు చేశాడు. ఇది వివాదంలో ఉన్నా ఈసీ ప్రతి చూపి చేసుకున్నాడు. రిజిస్ట్రేషన్ చేయించుకునేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నాడు.
బ్యాంకు మాజీ మేనేజర్ మస్తాన్ వలి తన వాటాగా రూ. 2.5 కోట్లు తీసుకున్నాడు. వీటితో నగరంలో ఖరీదైన ప్రాంతంలో ఒక ప్లాటు, యూసఫ్ గూడా లో మరో ప్లాట్ ను కొనుగోలు చేశాడు.
కెనరా బ్యాంకు మాజీ మేనేజర్ సాధన రూ. 1.99 కోట్లు స్వాహా చేశారు. ఈ మొత్తంతో శంకర్ పల్లి వద్ద రూ. 1.20 కోట్ల విల్లా, విశాఖపట్నం లోని ఖరీదైన ప్రాంతంలో ఫ్లాట్ కొనుగోలు చేశారు.
నండూరి వెంకట రమణ ఏపీలోని తణుకులో 41 సెంట్ల స్థలంలో బహుళ అంతస్తుల భవనం నిర్మిస్తున్నాడు. విశాఖ, విజయనగరం జిల్లాలోనూ స్థలాలు కొనుగోలు చేశాడు.
వైజాగ్కు చెందిన సాంబశివరావు తన వాటాగా రూ.55 లక్షలు తీసుకున్నాడు.