తెలంగాణ ఎంసెట్ కౌన్సెలింగ్ షెడ్యూల్ ఇదే.. సీటు రద్దు చేసుకోవడానికి 28నే లాస్ట్ డేట్

By telugu teamFirst Published Oct 22, 2021, 6:41 PM IST
Highlights

తెలంగాణ రాష్ట్ర ఎంసెట్ ఇంజినీరింగ్ కౌన్సెలింగ్ ఫైనల్ ఫేజ్ షెడ్యూల్‌ను ప్రభుత్వం విడుదల చేసింది. కౌన్సెలింగ్ డేట్లను సాంకేతిక విద్యా శాఖ కమిషనర్ నవీన్ మిట్టల్ వెల్లడించారు. ఈ షెడ్యూల్ ప్రకారం తొలి విడతలో అలాట్ చేసుకున్న సీట్లను రద్దు చేసుకోవడానికి ఈ నెల 28 చివరి తేదీగా ఉన్నది.

తెలంగాణలో eamcet ఇంజినీరింగ్ కౌన్సెలింగ్ తుది విడత schedule విడుదలైంది. తెలంగాణ ప్రభుత్వం ఈ షెడ్యూల్‌ను ఖరారు చేసి విడుదల చేసింది. సాంకేతిక విద్యా శాఖ కమిషనర్ నవీన్ మిట్టల్ షెడ్యూల్ తేదీలను విడుదల చేశారు. ఈ షెడ్యూల్ ప్రకారం, తొలి విడతలో భాగంగా అభ్యర్థులు అలాట్ చేసుకున్న Seatలను రద్దు చేయాలనుకుంటే.. అందుకు గడువు ఈ నెల 28వ తేదీ అని షెడ్యూల్ వెల్లడిస్తున్నది. ఈ షెడ్యూల్ వివరాలు ఇలా ఉన్నాయి.

ఈ నెల 25, 26వ తేదీల్లో ధ్రువపత్రాల పరిశీలనలకు స్లాట్ బుకింగ్ చేసుకోవాలి. 27వ తేదీన ఎంసెట్ ఇంజినీరింగ్ ధ్రువపత్రాల పరిశీలన ఉంటుంది. ఈ నెల 27వ తేదీ నుంచి 30వ తేదీ వరకు వెబ్ ఆప్షన్ల నమోదు చేసుకోవచ్చు. కాగా, వచ్చే నెల 2వ తేదీన తుది విడత ఇంజినీరింగ్ సీట్ల కేటాయింపు ఉంటుంది.

Also Read: అనంతపురం జిల్లా విద్యార్ధికి ఫస్ట్‌ర్యాంక్: ఏపీ ఎంసెట్ ఫలితాల విడుదల

నవంబర్ 9వ తేదీన ప్రత్యేక విడత కౌన్సెలింగ్ ఉంటుంది. నవంబర్ 9వ, 10వ తేదీల్లో  ఎంసెట్ ఇంజినీరింగ్ వెబ్ ఆప్షన్ల నమోదు ఉంటుంది. నవంబర్ 12వ తేదీన ప్రత్యేక విడత సీట్ల కేటాయింపు ప్రక్రియ జరుగుతుంది. వచ్చే నెల 14న స్పాట్ అడ్మిషన్ల మార్గదర్శకాలు విడుదలవుతాయి.

click me!