హైదరాబాద్‌లో మరో జైభీమ్.. బంగారం దొంగిలించాడని కేసు.. వేధింపులతో ఆత్మహత్య.. కోర్టుకెక్కిన భార్య

By telugu teamFirst Published Nov 13, 2021, 5:20 PM IST
Highlights

రాజధాని నగరం నడిబొడ్డులో మరో జై భీమ్ కథ రిపీట్ అయింది. బంగారం దొంగిలించాడన్న ఆరోపణలతో ఓ కూలీని పోలీసులు చిత్రహింసలు పెట్టారు. బంగారం తేవాల్సిందేనని డెడ్‌లైన్ పెట్టారు. అవమాన భారం, పోలీసు స్టేషన్‌లో ఏం జరుగుతుందోననే భయంతో ఆ వ్యక్తి ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఇప్పుడు ఆయన భార్య న్యాయం కోసం హైకోర్టును ఆశ్రయించారు. ఈ రోజు వాదనలు విన్న తర్వాత డిపార్ట్‌మెంట్ ఎంక్వైరీ చేసి రిపోర్ట్ సమర్పించాలని సీపీని హైకోర్టు ఆదేశించింది.

హైదరాబాద్: మారుమూల పల్లెలు.. అటవీ ప్రాంతాల్లో కాదు.. రాజధాని నగరం Hyderabad నడిబొడ్డున Jai Bheem కథ రిపీట్ అయినట్టు తెలుస్తున్నది. కూలీ పనికి వెళ్లిన ఆ వ్యక్తిపై బంగారం దొంగిలించాడన్న కేసు పెట్టారు. స్టేషన్‌కు తీసుకెళ్లి పోలీసులు చితక్కొట్టారు (Torture). ఐదు రోజుల్లో బంగారం తేవాలని ఫైనల్ వార్నింగ్ ఇచ్చారు. దొంగతనం పేరిట అవమానం, పోలీసులు చిత్రహింసలు, పేదరికం అన్నీ కలసి ఆయనను ఆత్మన్యూనతలోకి నెట్టేశాయి. గర్భవతితో ఉన్న భార్యకు వీడియో కాల్ చేసి మాట్లాడి.. తర్వాత ఉరి వేసుకుని Suicideకు పాల్పడ్డాడు. న్యాయం కోసం ఇప్పుడు ఆయన భార్య కోర్టు మెట్లెక్కింది. ఆమె వేసిన రిట్ పిటిషన్‌పై High Court విచారించి పది రోజుల్లో డిపార్ట్‌మెంట్ ఎంక్వైరీ రిపోర్టు సమర్పించాలని హైదరాబాద్ పోలీసు కమిషనర్‌ను ఆదేశించింది. కేసు వివరాలు ఇలా ఉన్నాయి..

కరోనాతో ఉపాధి కోల్పోయి.. వేలాది కుటుంబాలు రోడ్డున పడ్డాయి. ఏ పని దొరికినా చేయడానికి వెనుకాడని పరిస్థితికి ప్రజలను చేర్చింది. ఇదే దుస్థితిన అనుభవిస్తున్న సాయికుమార్ చారి కూడా ఏ పని దొరికినా మారు ఆలోచించకుండా వెళ్లేవాడు. అలాగే, బోయిన్‌పల్లిలో ఇంటికి పెయింట్ వేయడానికి కూలి పనికి ఈ ఏడాది మార్చి 6న వెళ్లాడు. అదే నెల 10వ తేదీన ఇంటి యజమాని ఒక తులం బంగారం పోయిందని పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఆ ఫిర్యాదు ఆధారంగా పోలీసులు చారిని, మరో వ్యక్తి కృష్ణాను బోయిన్‌పల్లి స్టేషన్‌కు పిలిచారు. 10వ తేదీ, 11వ తేదీల్లో పోలీసు లాకప్‌లో వారిని చిత్రహింసలకు గురి చేసినట్టు తెలిసింది. రబ్బర్‌లతో, కట్టెలతో తీవ్రంగా కొట్టినట్టు శివకుమార్ చారి భార్య ఆరోపించారు. 15వ తేదీ లోగా తులం బంగారాన్ని తెచ్చి ఇవ్వకుంటే తీవ్ర పరిణామాలుంటాయని వారిని పోలీసులు హెచ్చరించారు. చేయని దొంగతనం అవమానం ఒక వైపు.. పోలీసుల చిత్రహింసలు, పేదరికంగ మరో వైపు.. 15వ తేదీన పోలీసు స్టేషన్‌కు వెళ్తే ఏం జరుగుతుందోననే దిగులు ఇంకో వైపు.. వెరసి శివ కుమార్ ఆత్మహత్యకు
నిర్ణయించుకున్నాడు.  

Also Read: ‘జైభీమ్‌’... సూర్యాపేటలో గిరిజనుడిపై థర్డ్ డిగ్రీ...

సాయికుమార్ చారి, పావని కుటుంబం పొట్టపోసుకోవడానికి హైదరాబాద్‌కు వచ్చింది. ఆత్మహత్య చేసుకునే ముందు భార్యకు వీడియో కాల్ చేసి మాట్లాడాడు. మార్చి 14న ఆయన ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. సాయికుమార్ చనిపోయేనాటికి భార్య పావని గర్భిణి. 

Also Read: హృదయం బరువెక్కింది, రాత్రంతా నిద్రపట్టలేదు... సూర్య జై భీమ్ పై సీఎం స్టాలిన్ రివ్యూ

న్యాయం కోసం ఆమె డీజీపీ, పోలీసు కమిషనర్, ఇతర అధికారులకు ఫిర్యాదు చేసింది. కానీ, ఫలితం రాలేదు. దీంతో చేయని పాపానికి నేరం మోపి తన భర్త చావుకు కారణమైన వారిని శిక్షించాలని ఆమె కోర్టును ఆశ్రయించారు. జూన్ 2న ఆమె రిట్ ఫైల్ చేశారు. ఈ పిటిషన్‌పై జస్టిస్ విజయ్ సేన్ రెడ్డి వాదనలు విన్నారు. పది రోజుల్లోగా డిపార్ట్‌మెంట్ ఎంక్వయిరీ రిపోర్ట్ కోర్టుకు సమర్పించాలని హైదరాబాద్ పోలీసు కమిషనర్‌ను ఆదేశించారు. విచారణను ఈ నెల 24వ తేదీకి వాయిదా వేశారు. పావని తరఫున న్యాయవాది వీ రఘునాథ్ వాదనలు వినిపించారు.

click me!