
హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ పై రాచకొండ పోలీసు కమిషనరేట్ లో మరో ఫిర్యాదు నమోదు అయ్యింది. హెచ్ సీఏ మాజీ ప్రెసిడెంట్ జి.వినోద్, సెక్రటరీ శేషు నారాయణ్, మెంబర్ చిట్టి శ్రీధర్ బాబులు కలిసి సోమవారం రాచకొండ పోలీస్ కమిషనర్ మహేష్ భగవత్ కు తమ ఫిర్యాదును అందించారు.
గత సెప్టెంబర్ 26వ తేదీతోనే హెచ్ సీఏ ప్రెసిడెంట్ అజారుద్దీన్ పదవీ కాలం ముగిసిందని ఆ ఫిర్యాదులో వారు పేర్కొన్నారు. ఆయన పదవి కాలం ముగిసినప్పటికీ తప్పుడు ధృవపత్రాలను సృష్టించి బీసీసీఐ, ఎన్నికల కమిషన్ కమిటినీ తప్పుదోవ పట్టించే విధంగా అజరుద్దీన్ వ్యవహరించారని అందులో తెలిపారు.
మునుగోడు బైపోల్ 2022 : టీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్ అభ్యర్థల నామినేషన్లు నేడు...
పదవి కాలం పెంచుకునే విషయంలో అజారుద్దీన్ ఎవరినీ సంప్రదించలేదని, ఆయనే సొంతంగా గడువును పొడిగించున్నారని, దీనికి సంబంధించిన ఉత్తర్వులు కూడా జారీ చేశారని ఫిర్యాదులో చెప్పారు. ఈ నెల 18వ తేదీన బీసీసీఐ జనరల్ బాడీ మీటింగ్ జరగనుందని, అందులో పాల్గొనేందుకు వీలుగా అజారుద్దీన్ తన పదవి కాలాన్ని పొడగించుకున్నారని పేర్కొన్నారు.
వనపర్తి జిల్లాలో విషాదం... బైక్ తో సహా వాగులో కొట్టుకుపోయిన తల్లీ, కూతురు, కొడుకు
ఈ విషయంలో క్రిమినల్ కేసు కింద, ఐపీసీ ప్రకారం చట్ట ప్రకారం తగిన చర్యలు తీసుకోవాలని హైదరాబాద్ క్రికెట్ అసోషియేషన్ మాజీ ప్రతినిధులు రాచకొండ సీపీ మహేష్ భగవత్ ని కోరారు.