సెక్రటేరియట్ లో ఉద్యోగులు గల్లలు పట్టుకున్నారు

First Published Jul 5, 2017, 2:09 PM IST
Highlights

తెలంగాణ సచివాలయంలో తెలంగాణ ఉద్యోగులు గల్లలు గల్లలు పట్టుకున్నారు. పరస్థితి కొట్టుకునేవరకు వచ్చింది. సచివాలయ ఉద్యోగుల సంఘం వారు, టిఎన్జీఓ ఉద్యోగుల మధ్య ఈ పంచాయితీ నడిచింది.

తెలంగాణ ఉద్యోగుల మధ్య ఈ గొడవకు ఎపి ఉద్యోగుల పోస్టింగ్స్ విషయమే ప్రధాన కారణంగా తెలుస్తోంది. 24 మంది ఏపీ సెక్షన్ ఆఫీసర్ల తరలింపు విషయంలో సెక్రటేరియట్ డీ బ్లాక్ లో టీఎన్జీవోలు సమావేశమయ్యారు. దీనిపై ఆగ్రహం వ్యక్తం చేసిన తెలంగాణ సచివాలయ ఉద్యోగులు తమకు తెలియకుండా సచివాలయంలో ఎలా సమావేశమవుతారంటూ టీఎన్జీవోల మీటింగ్ ను అడ్డుకున్నారు. దీంతో ఇరువర్గాల మధ్య  తోపులాట జరిగి పరిస్థితి ఉద్రిక్తంగా మారింది.

 

ఆరు నెలల క్రితం 24 మంది ఏపీ స్థానికత ఉన్న సెక్షన్ ఆఫీసర్లను తెలంగాణ ప్రభుత్వం రిలీవ్ చేసింది. కానీ వారిని ఏపీ ప్రభుత్వం అక్కడ చేర్చుకోలేదు. దీంతో వారంతా తిరిగి తెలంగాణకు వచ్చే ప్రయత్నంలో ఉన్నారు.  వారికి తెలంగాణ సచివాలయ ఉద్యోగుల సంఘం నేత నరేందర్ రావు మద్దతు ఉందని టిఎన్జీఓలు ఆరోపిస్తున్నారు. నరేందర్ రావు ప్రోద్భలంతోనే ఏపీ అధికారులు దొడ్డి దారిలో తిరిగి తెలంగాణ సచివాలయంలో చేరేందుకు పావులు కదుపుతున్నారని టిఎన్జీఓలు ప్రధానంగా ఆరోపిస్తున్నారు. అందుకే తమ మీటింగ్ ను సచివాలయ ఉద్యోగులు అడ్డుకున్నారని వారు అంటున్నారు.

 

ఇరు వర్గాలు గల్లలు గల్లలు పట్టుకునే సమయంలోనే మీడియా రావడంతో కొద్దిసేపు అక్కడ ఉండి ఎవరి దారిన వారు వెళ్లిపోయారు.

click me!