కేసులు పెడ్తా: ప్రణయ్ భార్య అమృత వార్నింగ్

First Published 23, Sep 2018, 9:25 AM IST
Highlights

అమృతకు ఆర్థిక సాయం అందించడానికి, ఉద్యోగం ఇవ్వడానికి, ఇల్లూ భూమి ఇవ్వడానికి తెలంగాణ ప్రభుత్వం ముందుకు వచ్చింది.  ప్రణయ్‌తో ప్రేమ పెళ్లి నుంచి ప్రారంభించి హత్య వరకు అన్ని విషయాల్లో ఆమెను తప్పు పడుతూ కొంత మంది పోస్టులు పెడుతున్నారు.

మిర్యాలగూడ: సోషల్ మీడియాలో తనను అవమానించేలా పోస్ట్‌లు పెడితే కేసులు పెడతానని ప్రణయ్‌ భార్య అమృత వర్షిణి హెచ్చరించారు. అమృత భర్త ప్రణయ్ తన తండ్రి మారుతీరావు చేతిలో హతమైన విషయం తెలిసిందే. మారుతీరావును సమర్థిస్తూ అమృతను అవమానిస్తూ సోషల్ మీడియాలో కొంత మంది పోస్టులు పెడుతున్నారు. దానిపైనే అమృత స్పందించారు. 

అమృతకు ఆర్థిక సాయం అందించడానికి, ఉద్యోగం ఇవ్వడానికి, ఇల్లూ భూమి ఇవ్వడానికి తెలంగాణ ప్రభుత్వం ముందుకు వచ్చింది.  ప్రణయ్‌తో ప్రేమ పెళ్లి నుంచి ప్రారంభించి హత్య వరకు అన్ని విషయాల్లో ఆమెను తప్పు పడుతూ కొంత మంది పోస్టులు పెడుతున్నారు.
 
అలాంటి పోస్టింగ్‌లు పెట్టేవారిపై కోర్టులో కేసులు వేస్తానని ఆమె అంటున్నారు. అమృత సమస్యను రెండు కులాలకు చెందిన విషయంగా మార్చేసి సామాజిక మాధ్యమాల్లో చర్చలు కూడా చేస్తున్నారు. 

హత్యకు గురైన ప్రణయ్‌ విగ్రహాన్ని ఏర్పాటు చేయకూడదని స్థానికంగా కొందరు ఓ అడ్వకేట్‌ ఆధ్వర్యంలో డీఎస్పీ, మున్సిపల్‌, ఎమ్మెల్యే కార్యాలయాల్లో వినతిపత్రాలు అందజేసినట్లు సమాచారం.

సంబంధిత వార్తలు

మిర్యాలగుడా అసెంబ్లీ టికెట్ ఆఫర్: అమృత స్పందన ఇదీ...

మిర్యాలగూడ అసెంబ్లీ సీటుకు ప్రణయ్ భార్య అమృత పోటీ

ప్రణయ్ ఫ్యామిలీకి పరామర్శ: మాజీ ఎంపీ వివేక్ కన్నీటి పర్యంతం

ప్రణయ్‌ను హత్య చేసింది బీహార్ వాసి శర్మ, ఫ్లైట్లో హైదరాబాదుకు తరలింపు

ప్రణయ్ హత్య: మాజీ ఎమ్మెల్యే వేముల వీరేశాన్ని కూడ విచారిస్తాం: ఎస్పీ

ప్రణయ్ హత్యపై చంద్రబాబు స్పందన ఇదీ..

Last Updated 23, Sep 2018, 9:25 AM IST