తెల్లవారుజామునే కదిలిన ఖైరతాబాద్ గణపతి... మధ్యాహ్ననికల్లా నిమజ్జనం

By sivanagaprasad kodatiFirst Published Sep 23, 2018, 7:17 AM IST
Highlights

ఖైరతాబాద్ మహా గణపతి ఈసారి అందరికన్నా ముందుగానే నిమజ్జనానికి కదిలాడు. ట్రాఫిక్ ఇబ్బందులు.. ఇతర కారణాల కారణంగా నిమజ్జనం ఆలస్యం కాకూడదనే ఉద్దేశ్యంతో ఈసారి ముందుగానే ఖైరతాబాద్ గణపతి గంగమ్మ దగ్గరకు తరలివెళ్లాడు

ఖైరతాబాద్ మహా గణపతి ఈసారి అందరికన్నా ముందుగానే నిమజ్జనానికి కదిలాడు. ట్రాఫిక్ ఇబ్బందులు.. ఇతర కారణాల కారణంగా నిమజ్జనం ఆలస్యం కాకూడదనే ఉద్దేశ్యంతో ఈసారి ముందుగానే ఖైరతాబాద్ గణపతి గంగమ్మ దగ్గరకు తరలివెళ్లాడు.

నిన్న రాత్రి 11 గంటల సమయానికి భారీ విగ్రహం చుట్టూ ఉన్న అలంకరణలను తొలగించారు. అనంతరం 12 గంటల కల్లా, వెల్డింగ్ పనులను ప్రారంభించి.. ఒంటిగంట నుంచి భక్తుల దర్శనాలను నిలిపివేశారు. విజయవాడలోని ఓ ట్రాన్స్‌పోర్ట్ కంపెనీ నుంచి తెచ్చిన భారీ వాహనంపై ప్రత్యేక క్రేన్ సాయయంతో విగ్రహాన్ని ఉదయం 6 గంటలకల్లా ఎక్కించారు.

ఖైరతాబాద్ బొజ్జ గణపయ్య శోభాయాత్ర లక్డీకపూల్, టెలిఫోన్ భవన్, సెక్రటేరియేట్ మీదుగా ఎన్టీఆర్ మార్గ్ లోకి ప్రవేశించనుంది. ఎట్టి పరిస్థితుల్లో మధ్యాహ్నం 12 గంటలలోపు నిమజ్జనాన్ని పూర్తి చేయాలని భాగ్యనగర గణేశ్ ఉత్సవ కమిటీ, జీహెచ్ఎంసీ, పోలీసులు సమన్వయంతో పనిచేస్తున్నారు. ఈ సారి ఖైరతాబాద్ గణపయ్య ‘‘సప్తముఖ కాళసర్ప మహాగణపతి అవతారం’’లో భక్తులకు దర్శనమిచ్చారు.

click me!
Last Updated Sep 23, 2018, 7:17 AM IST
click me!