మిర్యాలగుడా అసెంబ్లీ టికెట్ ఆఫర్: అమృత స్పందన ఇదీ...

By pratap reddyFirst Published Sep 22, 2018, 6:13 PM IST
Highlights

వచ్చే ఎన్నికల్లో మిర్యాలగుడా అసెంబ్లీ స్థానం నుంచి అమృతను బిఎల్ఎఫ్ తరఫున పోటీకి దింపుదామని సిపిఎం తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం ప్రతిపాదించారు. అన్ని పార్టీలు అందుకు మద్దతు తెలపాలని ఆయన కోరారు. 

మిర్యాలగూడ: వచ్చే శాసనసభ ఎన్నికల్లో తనకు మిర్యాలగుడా శాసనసభ స్థానాన్నికేటాయిస్తారనే వార్తలపై హత్యకు గురైన ప్రణయ్ భార్య అమృత వర్షిణి స్పందించారు. ఆమెకు అసెంబ్లీ సీటు ఇస్తారనే అంశం సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది.

ఏదో ఆశించి తాను ఇప్పటివరకు ఏ పార్టీ నేతలతో సంప్రదింపులు జరపలేదని అమృత తెలిపింది. తనకు అసెంబ్లీ టికెట్‌పై ఆశ లేదని చెప్పారు. ప్రణయ్‌ను హత్య చేసిన వారికి ఉరి శిక్ష వేసి.. న్యాయం చేయాలని మాత్రమే తాను డిమాండ్ చేస్తున్నట్లు ఆమె తెలిపారు. 

వచ్చే ఎన్నికల్లో మిర్యాలగుడా అసెంబ్లీ స్థానం నుంచి అమృతను బిఎల్ఎఫ్ తరఫున పోటీకి దింపుదామని సిపిఎం తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం ప్రతిపాదించారు. అన్ని పార్టీలు అందుకు మద్దతు తెలపాలని ఆయన కోరారు. 

ఇటీవల ఆమెను మిర్యాలగూడ మాజీ శాసనసభ్యుడు జూలకంటి రంగారెడ్డి, ప్రొఫెసర్ కంచ అయిలయ్యలతో కలిసి అమృతను పరామర్శించారు. ఈ సందర్భంగా తమ్మినేని వీరభద్రం ఆ ప్రతిపాదన చేశారు. దీంతో వచ్చే ఎన్నికల్లో అమృత పోటీ చేస్తారనే ప్రచారం ఊపందుకుంది.

సంబంధిత వార్తలు

మిర్యాలగూడ అసెంబ్లీ సీటుకు ప్రణయ్ భార్య అమృత పోటీ

ప్రణయ్ ఫ్యామిలీకి పరామర్శ: మాజీ ఎంపీ వివేక్ కన్నీటి పర్యంతం

ప్రణయ్‌ను హత్య చేసింది బీహార్ వాసి శర్మ, ఫ్లైట్లో హైదరాబాదుకు తరలింపు

ప్రణయ్ హత్య: మాజీ ఎమ్మెల్యే వేముల వీరేశాన్ని కూడ విచారిస్తాం: ఎస్పీ

ప్రణయ్ హత్యపై చంద్రబాబు స్పందన ఇదీ..

click me!