టైం, ప్లేస్ చెప్పు ఎక్కడికైనా వస్తా..కాంగ్రెస్ పాత్ర ఏంటో చూపిస్తా: మధుయాష్కీ

By Nagaraju TFirst Published Sep 22, 2018, 5:56 PM IST
Highlights

 తెలంగాణ రాష్ట్ర ఏర్పాటులో కాంగ్రెస్‌ పాత్రపై బహిరంగ చర్చకు సిద్ధామా అని టీఆర్‌ఎస్‌ ఎంపీ వినోద్‌కి కాంగ్రెస్ మాజీ ఎంపీ మధుయాష్కి సవాల్‌ విసిరారు. టైమ్‌ ,ప్లేస్‌ చెప్పు ఎక్కడికైనా వస్తా కాంగ్రెస్ పాత్ర ఏంటో చెప్తా అంటూ వార్నింగ్ ఇచ్చారు. 

హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర ఏర్పాటులో కాంగ్రెస్‌ పాత్రపై బహిరంగ చర్చకు సిద్ధామా అని టీఆర్‌ఎస్‌ ఎంపీ వినోద్‌కి కాంగ్రెస్ మాజీ ఎంపీ మధుయాష్కి సవాల్‌ విసిరారు. టైమ్‌ ,ప్లేస్‌ చెప్పు ఎక్కడికైనా వస్తా కాంగ్రెస్ పాత్ర ఏంటో చెప్తా అంటూ వార్నింగ్ ఇచ్చారు. 

ఆజాద్‌ వ్యాఖ్యలపై టీఆర్‌ఎస్‌ ఎంపీ వినోద్‌ సోయిలేకుండా మాట్లాడుతున్నారని మండిపడ్డారు. రాష్ట్రాలను ఏర్పాటు చేసే అధికారం పార్లమెంట్‌కు ఉంటుందన్న కనీస సోయి కూడా వినోద్‌కు లేదని ఎద్దేవా చేశారు. ప్రజల త్యాగాలను గుర్తించే సోనియా గాంధీ తెలంగాణ ఇచ్చిందన్నారు. తెలంగాణ కాంగ్రెస్‌ ఇవ్వలేదంటే టీఆర్‌ఎస్‌ నేతలు పురుగులు పడి చస్తారన్నారు. 

రెండు ఎంపీ స్థానాలతో తెలంగాణ తెచ్చామంటే ఇప్పుడు ఇంత మంది ఎంపీలు ఉండి మైనార్టీ రిజర్వేషన్‌లు ఎందుకు సాధించలేకపోతున్నారని మధుయాష్కీ ప్రశ్నించారు. వినోద్‌, అతని తమ్ముడు, కేసీఆర్‌ కుటుంబ ఆస్తుల వివరాలు ప్రజలకు చెప్పాలని డిమాండ్‌ చేశారు. 

మెడికల్ కాలేజీ కోసం నువ్వు,నీ తమ్ముడు నన్ను ఎన్నిసార్లు కలిసి బతిమిలాడావో మరిచిపోయవా అని వినోద్‌ను నిలదీశారు. ఆజాద్, జైరాం రమేష్ చుట్టూ కూడా ఎన్నో సార్లు చక్కర్లు కొట్టిన సంగతి మరిచిపోతే ఎలా అని మధుయాష్కీ వ్యాఖ్యానించారు.
 
కేసీఆర్ నిమ్స్‌లో ఉన్నప్పుడు కేటీఆర్, కవితలు తనను కలిసి బతిమాలాడింది గుర్తులేదా అన్నారు. కాళేశ్వరం రీడిజైన్‌తో కల్వకుంట్ల కంపుగా మారిపోయిందని విమర్శించారు. వైఎస్ జగన్ ఫోన్ చేస్తే రాయలసీమ కాంట్రాక్టర్లకు పనులు ఇచ్చింది నిజం కాదా అని ప్రశ్నించారు. అలాగే పద్మాలయ కేసును ఎందుకు ఉపసంహరించుకున్నారో హరీష్ చెప్పాలని యాష్కీ డిమాండ్ చేశారు.
 
అబద్ధపు వాగ్ధానాలతోనే 2014లో కేసీఆర్ అధికారంలోకి వచ్చారని ఆరోపించారు. పేదలకు డబుల్ బెడ్రూం ఇళ్లులు లేవుగానీ, కవితకు మాత్రం కోట్లు విలువ చేసే విల్లాలున్నాయని ఆరోపించారు. 

మరోవైపు మంత్రి హరీష్‌రావు ఆవేదన అంతా ఒట్టి డ్రామాగా అభివర్ణించారు మధుయాష్కీ. టీఆర్‌ఎస్‌లో కేసీఆర్‌పై అసంతృప్తితో ఉన్న వారందరినీ హరీష్‌ దగ్గర చేసుకునేందుకే డ్రామా ఆడుతున్నారని విమర్శించారు. 2019లో సైలెంట్‌ విప్లవం రాబోతుందని, టీఆర్‌ఎస్‌ను బొందపెట్టి కాంగ్రెస్‌ అధికారంలోకి రావడం ఖాయమని మధుయాష్కి ధీమా వ్యక్తం చేశారు.

click me!
Last Updated Sep 22, 2018, 5:56 PM IST
click me!