అమిత్ షా వెళ్లే విమానంలో సాంకేతిక సమస్య: హైద్రాబాద్‌లోనే కేంద్ర మంత్రి

By narsimha lode  |  First Published Mar 12, 2023, 2:11 PM IST

కేంద్ర మంత్ర అమిత్  షా వెళ్లాల్సిన విమనాంలో  సాంకేతిక  సమస్య నెలకొంది. 


హైదరాబాద్:  కేంద్ర హోం శాఖ మంత్రి అమిత్ షా  వెళ్లాల్సిన  విమానంలో  సాంకేతిక సమస్య తలెత్తింది.  దీంతో  ప్రత్యామ్నాయ ఏర్పాట్లు  చేస్తున్నారు అధికారులు. 

సీఐఎస్ఎఫ్ రైజింగ్  డేలో   పాల్గొనేందుకు గాను  కేంద్ర మంత్రి అమిత్ షా  నిన్న రాత్రి హైద్రాబాద్ కు చేరుకున్నారు. ఆదివారంనాడు  హైద్రాబాద్ లో  జరిగిన సీఐఎస్ఎఫ్ రైజింగ్  డేలో   వేడుకల్లో ఆయన  పాల్గొన్నారు. హైద్రాబాద్ నుండి  కేంద్ర మంత్రి అమిత్ షా  కొచ్చి వెళ్లాల్సి ఉంది.  ఇవాళ ఉదయం  11:40  గంటలకుఅమిత్ షా  కొచ్చి బయలుదేరాల్సి ఉంది.  కానీ అమిత్ షా  ప్రయాణం చేయాల్సిన విమానంలో  సాంకేతిక సమస్య తలెత్తింది. ఈ విషయాన్ని గుర్తించిన  అధికారులు  ప్రత్యామ్నాయ  ఏర్పాట్లు చేస్తున్నారు. విమానంలో సాంకేతిక సమస్యను మంత్రి అమిత్ షాకు తెలిపారు. దీంతో  హైద్రాబాద్ లోని  అమిత్ షా ఉన్నారు.  ఈ విషయం తెలుసుకున్న తెలంగాణ బీజేపీ నేతలు  కేంద్ర మంత్రి అమిత్ షాతో భేటీ అయ్యారు. 

Latest Videos

రాష్ట్రంలో  పార్టీని బలోపేతీం  చేసే విషయమై  అమిత్ షాతో  పార్టీ నేతలు  చర్చించారు.  బీఆర్ఎస్  వ్యూహను ఎదుర్కొనేందుకు అవలంభించాల్సిన వ్యూహంపై  బీజేపీ నేతలకు  అమిత్ షా దిశా నిర్ధేశం  చేశారని  సమాచారం. 

 

click me!