హైదరాబాద్ హస్తినాపురంలో అంబులెన్స్ బోల్తా, డ్రైవర్ మృతి...

Published : Jul 25, 2023, 08:20 AM IST
హైదరాబాద్ హస్తినాపురంలో అంబులెన్స్ బోల్తా, డ్రైవర్ మృతి...

సారాంశం

హైదరాబాద్ లో ఓ అంబులెన్స్ బోల్తాపడి, ఆక్సీజన్ సిలిండర్ పేలడంతో డ్రైవర్ మృతి చెందాడు. 

హైదరాబాద్ : తెలంగాణ రాజధాని హైదరాబాద్ లో విషాద ఘటన చోటు చేసుకుంది. హస్తినాపురంలో అర్థరాత్రి అంబులెన్స్ బోల్తా పడింది. దీంతో ఆక్సీజన్ సిలిండర్ పేలి.. అంబులెన్స్ డ్రైవర్ మంటల్లో కాలిపోయి మృతి చెందాడు. అంబులెన్స్ కూడా పూర్తిగా దగ్థమయ్యింది. అంబులెన్స్ ఓ ప్రైవేట్ ఆస్పిటల్ కి చెందిందిగా తెలుస్తోంది. 

మలక్ పేట్ లోని ఓ ప్రైవేట్ హాస్పిటల్ నుంచి ఓ రోగిని తీసుకుని వేరే ఆస్పత్రిలో దించి.. వస్తుండగా బీఎన్ రెడ్డి నగర్ దగ్గర డివైడర్ ను ఢీ కొని బోల్తా పడింది. అంబులెన్స్ ను లేపుతుండగా మంటలు అంటుకుని.. ఆక్సీజన్ సిలిండర్ పేలింది. ఈ ఘటనలో డ్రైవర్ మల్లేష్ అక్కడికక్కడే మృతి చెందాడు. అంబులెన్స్ పూర్తిగా ఖాళి బూడిదైపోయింది. రోడ్డు మధ్యలో డివైడర్ ఉండడం అది చీకట్లో కనిపించలేదని స్థానికులు అంటున్నారు.  దీనికి సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది. 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

IMD Cold Wave Alert : ఈ ఐద్రోజులు అల్లకల్లోలమే... ఈ జిల్లాలకు ఆరెంజ్, ఎల్లో అలర్ట్స్
Hyderabad వైపు ట్రంప్ చూపు.. ఈ ప్రాంతం మరో కోకాపేట్ కావడం ఖాయం...!