3,797 వీఆర్ఏల పిల్లలకు ఉద్యోగాలు: కేసీఆర్

By narsimha lode  |  First Published Jul 24, 2023, 10:20 PM IST

వీఆర్ఏలను  వారి విద్యార్హత ఆధారంగా  ప్రభుత్వ శాఖల్లో నియమించారు. ఆయా ప్రభుత్వ శాఖల్లో  మంచి పేరు తెచ్చుకోవాలన్నారు. వీఆర్ఏలను  ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించిన విషయం తెలిసిందే.


హైదరాబాద్: ఫ్యూడల్ వ్యవస్థకు అవశేషంగా విఆర్ఏ వ్యవస్థ కొనసాగిందని  తెలంగాణ సీఎం  కేసీఆర్ చెప్పారు.గ్రామాల్లో తరతరాలుగా, అతి తక్కువ జీతంతో రైతుల కల్లాల దగ్గర దానం అడుక్కునే పద్ధతిలో ఎన్నో తరాలుగా వీఆర్ ఏలు పనిచేశారని తెలంగాణ సీఎం కేసీఆర్  గుర్తు చేశారు. మహారాష్ట్రలో కూడా చాలా తక్కువ జీతంతోని విఆర్ఏలు పనిచేస్తున్నారని మహారాష్ట్ర బిఆర్ఎస్ నాయకులు  తన దృష్టికి తెచ్చారన్నారు. 

వీఆర్ఏల క్రమబద్ధీకరణను మహారాష్ట్రకు చెందిన  బీఆర్ఎస్ నేతలు  అభినందిస్తున్నారని సీఎం తెలిపారు. కొత్త ఉద్యోగాలు చేపట్టనున్న వీఆర్ఏలను సీఎం  అభినందించారు. 10 వ తరగతి అర్హత కలిగిన  10,317 మంది నీటిపారుదల, మిషన్ భగీరథ విభాగాల్లో  విధులు నిర్వహించనున్నారు. ఇంటర్మీడియట్ విద్యార్హత కలిగిన 2,761 మంది రికార్డు అసిస్టెంట్ హోదా తో, డిగ్రీ ఆ పై విద్యార్హత కలిగిన 3,680 మంది  జూనియర్ అసిస్టెంట్ గా విధులు నిర్వర్తిస్తారని సీఎం స్పష్టం చేశారు. ఫైనాన్స్ డిపార్ట్ మెంట్ ఈ పోస్టులకు అప్రూవల్ ఇచ్చిందని సీఎం కేసీఆర్ వివరించారు.  మరో కేటగిరీలో 3,797 మంది 61 సంవత్సరాలు దాటిన వారున్నారని సీఎం చెప్పారు.  ఇంత కాలం సమాజానికి చేసిన సేవకు గాను,  మానవీయ కోణంలో ఆలోచించి, వారు కొనసాగుతున్న క్వాలిఫికేషన్ తోనే వారి పిల్లలకు ఉద్యోగాలిస్తామని సీఎం హామీ ఇచ్చారు. 

Latest Videos

undefined

వీఆర్ఏల జెఎసి ఎంత తొందరగా లిస్ట్ ఇస్తే అంత తొందరగా వారికి ఆర్డర్ లిస్తామని సీఎం కేసీఆర్ తెలిపారు. ఈ ఆర్డర్ లోనే  ఆ విషయాలను పొందుపరిచినట్లు సీఎం ప్రకటించారు.  విఆర్ఎ లు ఇక నుంచి పే స్కేల్ ఉద్యోగులు అని సీఎం తెలిపారు.

also read:ఇకనుండి ప్రభుత్వ ఉద్యోగులు: జీవో కాపీని వీఆర్ఏ జేఏసీ నేతలకు అందించిన కేసీఆర్

 ఆయా డిపార్ట్ మెంట్లలో మంచి పేరు తెచ్చుకోవాలని సీఎం  వీఆర్ఏలను కోరారు. కెటిఆర్ జన్మదినం సందర్భంగా ఈ రోజు ఉత్తర్వులిస్తే ఇస్తే బాగుంటందని భావించి సీఎస్ శాంతి కుమారి, రెవెన్యూ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ  ఈ రోజే ఉత్తర్వులు వచ్చే విధంగా కృషి చేశారని సీఎం తెలిపారు. ఈ ప్రక్రియలో ఎలాంటి లీగల్ సమస్యలు తలెత్తకుండా జీవోను రూపొందించినందుకు  అధికారులను  సీఎం ప్రత్యేకంగా అభినందించారు.

 

tags
click me!