భర్తల గెలుపు కోసం.. రంగంలోకి భార్యలు

Published : Nov 21, 2018, 01:16 PM ISTUpdated : Nov 21, 2018, 01:25 PM IST
భర్తల గెలుపు కోసం.. రంగంలోకి భార్యలు

సారాంశం

నియోజకవర్గాల్లో ఇంటింటికీ తిరుగుతూ.. ఎన్నికల ప్రచారం చేపడుతున్నారు. తమకు ఓటు వేసి గెలిపించాలని ఓటర్లను కోరుతున్నారు.  

తెలంగాణలో ఎన్నికల ప్రచార హోరు మొదలైంది. టికెట్ దక్కించుకున్న అభ్యర్థులంతా తమ తమ నియోజకవర్గాల్లో ఇంటింటికీ తిరుగుతూ.. ఎన్నికల ప్రచారం చేపడుతున్నారు. తమకు ఓటు వేసి గెలిపించాలని ఓటర్లను కోరుతున్నారు.

కాగా.. కొందరు అభ్యర్థులు వారు ప్రచారం చేయడమే కాకుండా.. తమ భార్యలను కూడా ఈ రంగంలోకి దింపారు.  వికారాబాద్ కాంగ్రెస్ అభ్యర్థి గడ్డం ప్రసాద్ కుమార్ సతీమణి శైలజా.. మంగళవారం ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. వికారాబాద్ పట్టణంలోని ఇంటింటికీ తిరుగుతూ.. హస్తం గుర్తుకు ఓటు వేయాలని కోరారు.

అదే ప్రాంతంలో స్వతంత్ర్య అభ్యర్థి డాక్టర్ ఎ. చంద్రశేఖర్ సతీమణి ప్రమీల కూడా వికారాబాద్ లో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. తనతో పాటు మరికొందరు మహిళలను వెంటపెట్టుకొని ఆమె ప్రచారం చేస్తున్నారు. 

raed more news

కేసిఆర్ సభకు ఈటెల సతీమణి, కోడలు, కూతురు పాదయాత్ర

PREV
click me!

Recommended Stories

Pensions: తెలంగాణ‌లో రూ. 4 వేలకి పెర‌గ‌నున్న‌ పెన్ష‌న్‌.. ఎప్ప‌టి నుంచి అమ‌లు కానుంది? ప్ర‌భుత్వం ప్లాన్ ఏంటి.?
School Holidays : తెలుగు స్టూడెంట్స్ ఎగిరిగంతేసే వార్త... డిసెంబర్ 16,17 రెండ్రోజులు సెలవే