ఠాగూర్ పై వ్యాఖ్యలు: మర్రి శశిధర్ రెడ్డితో భేటీ కానున్న ఎఐసీసీ సెక్రటరీ జావెద్

By narsimha lode  |  First Published Aug 18, 2022, 11:59 AM IST

కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత మర్రి శశిధర్ రెడ్డి ఇంటికి వెళ్లనున్నారు ఎఐసీసీ సెక్రటరీ జావెద్., పార్టీలో చోటు చేసుకొంటున్న పరిణామాలపై శశిధర్ రెడ్డితో ఆయన చర్చించనున్నారు. 


హైదరాబాద్:  కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత మర్రి శశిధర్ రెడ్డి ఎఐసీసీ సెక్రటరీ జావెద్ భేటీ కానున్నారు. . మర్రి శశిధర్ రెడ్డి నిన్న టీపీసీసీ చీప్ రేవంత్ రెడ్డి, మాణికం ఠాగూర్ పై చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో ఈ భేటీకి ప్రాధాన్యత నెలకొంది. 

తెలంగాణ కాంగ్రెస్ లో చోటు చేసుకున్న పరిణామాలపై పార్టీ అధిష్టానానికి నేతలు నివేదికలు పంపుతున్నారు. పార్టీ సీనియర్ నేత మర్రి శశిధర్ రెడ్డి లేవనెత్తిన అంశాల నేపథ్యంలో ఎఐసీసీ సెక్రటరీ జావెద్ శశిధర్ రెడ్డితో  చర్చలు జరపనున్నారు. కాంగ్రెస్ పార్టీలో గత కొంతకాలంగా చోటు చేసుకున్న పరిణామాలపై శశిధర్ రెడ్డి తన అసంతృప్తిని మీడియా వేదికగా బయట పెట్టారు.

Latest Videos

undefined

మూడు మాసాల నుండి పార్టీలో చోటు చేసుకున్న పరిణామాలపై తనకు అసంతృప్తి ఉందని శశిధర్ రెడ్డి అభిప్రాయపడ్డారు. గాంధీ భవన్ లో కాకండా రేవంత్ రెడ్డి వ్యక్తిగతంగా నిర్ణయాలు తీసుకోవడాన్ని మర్రి శశిధర్ రెడ్డి తప్పు బడుతున్నారు. పార్టీకి నష్టం చేసేలా రేవంత్ రెడ్డి నిర్ణయాలున్నాయనే అభిప్రాయంతో శశిధర్ రెడ్డి ఉన్నారు. పార్టీకి చెందిన  సీనియర్లు ఇదే అభిప్రాయాన్ని  వ్యక్తం చేస్తుండడం గమనార్హం.

పార్టీలోని అందరూ నేతలను కలుపుకుపోకుండా ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారనే  అభిప్రాయంతో  సీనియర్లున్నారు.  సమయం వచ్చినప్పుడల్లా సీనియర్లు తమ అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు. అంతేకాదు అవకాశం వస్తే అధిష్టానానికి కూడా ఫిర్యాదులు చేసేందుకు కూడా వెనుకాడడం లేదు. 

వరంగల్ సభకు ముందుగా రాహుల్ గాంధీతో తెలంగాణకు చెందిన ముఖ్యులు సమావేశమయ్యారు.ఈ సమావేశంలో పార్టీకి చెందిన అంతర్గత వ్యవహరాలపై బహిరంగంగా వ్యాఖ్యలు చేయవద్దని రాహుల్ గాంధీ సూచించారు. అలా చేస్తే ఎంత పెద్ద నేత అయినా కూడా చర్యలు తప్పవని హెచ్చరించారు. ఈ సమావేశం తర్వాత  ఈ రకమైన పరిస్థితి కొంత తగ్గినట్టుగా కన్పించింది.  ఆ తర్వాత పార్టీలో చోటు చేసుకొన్న పరిణామాలపై  అసంతృప్తిగా ఉన్న కూడా జగ్గారెడ్డి నోరు మెదపలేదు. కానీ ఇటీవలనే ఆయన   మీడియా సమావేశంలో రేవంత్ రెడ్డిపై అసంతృప్తిని వెళ్లగక్కారు. రాహుల్ గాంధీకి ఇచ్చిన మాటను తప్పి ఈ వ్యాఖ్యలు చేయాల్సి వచ్చిందని కూడా ఆయన  గుర్తు చేసుకున్నారు. ఆ తర్వాత జగ్గారెడ్డి హైద్రాబాద్ లో కంటే తన నియోజకవర్గానికే ఎక్కువగా పరిమితమయ్యారు. నవంబర్ మాసంలో తాను మౌనం వీడుతానని చెప్పారు. గాంధీ భవన్ లో తాను మీడియా సమావేశం ఏర్పాటు చేస్తానని ప్రకటించారు. 

వివాదాలకు దూరంగా ఉంటే మర్రి శశిధర్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం పార్టీలో దుమారాన్ని రేపుతున్నాయి. రెడ్డి సామాజిక వర్గమే కేసీఆర్ ను ఎదుర్కొనే దమ్ముందని రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యల విషయాన్ని మర్రి శశిదర్ రెడ్డి ప్రధానంగా ప్రస్తావిస్తున్నారు.ఈ వ్యాఖ్యలు పార్టీకి తీవ్రంగా నష్టం చేశాయన్నారు. ఈ వ్యాఖ్యలు పార్టీ అభిప్రాయం కాదని అధిష్టానం చెబుతుందని ఠాగూర్ తమకు చెప్పారన్నారు. కానీ అదే విషయాన్ని మీడియా వేదికగా చెబితే నష్ట నివారణ జరిగేదని మర్రి శశిధర్ రెడ్డి అభిప్రాయంగా ఉంది. అయితే ఈ వ్యాఖ్యలను పార్టీ వేదికలపై కాకుండా మీడియా వేదికగా మర్రి శశిధర్ రెడ్డి లేవనెత్తడం చర్చకు దారితీసింది.

also read:తెలంగాణ కాంగ్రెస్‌లో రోజుకో గొడవ: మర్రి శశిధర్ రెడ్డి వ్యాఖ్యలకు అద్దంకి దయాకర్ కౌంటర్

ఎఐసీసీ సెక్రటరీ జావెద్ వద్ద  ఇటీవల కాలంలో పార్టీలో చోటు చేసుకొంటున్న పరిణామాలను  మర్రి శశిధర్ రెడ్డి వివరించే అవకాశం ఉంది. పార్టీలో ఏం జరుగుతుంది, పార్టీ నష్టపోకుండా ఏం చర్యలు తీసుకోవాలనే దానిపై  చర్చించే అవకాశం లేకపోలేదు.

click me!