ఎస్కలేటర్‌ వేగంగా కదలడంతో 9 మంది విద్యార్థులకు గాయాలు.. అపోలోకు తరలింపు.. అసలేం జరిగిందంటే..

Published : Aug 18, 2022, 11:33 AM ISTUpdated : Aug 18, 2022, 11:35 AM IST
ఎస్కలేటర్‌ వేగంగా కదలడంతో 9 మంది విద్యార్థులకు గాయాలు.. అపోలోకు తరలింపు.. అసలేం జరిగిందంటే..

సారాంశం

హైదరాబాద్‌లో ఎస్కలేటర్‌పై నుంచి కిందపడి 9 మంది విద్యార్థులు గాయపడ్డారు. ఎస్కలేటర్‌ స్పీడ్‌గా కదలడంతో ఈ ఘటన చోటుచేసుకుంది. విద్యార్థులను భారతీయ విద్యా భవన్ స్కూల్‌క చెందిన వారిగా గుర్తించారు.   

హైదరాబాద్‌లో ఎస్కలేటర్‌పై నుంచి కిందపడి 9 మంది విద్యార్థులు గాయపడ్డారు. విద్యార్థులను భారతీయ విద్యా భవన్ స్కూల్‌క చెందిన వారిగా గుర్తించారు. వివరాలు.. స్వతంత్ర భారత వజ్రోత్సవాల్లో భాగంగా విద్యార్థులు, ప్రజల్లో దేశభక్తి నింపేలా తెలంగాణ ప్రభుత్వం.. రాష్ట్రంలోని పలు థియేటర్లలో గాంధీ సినిమాను ప్రదర్శిస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే గురువారం బంజారాహిల్స్‌లోని ఆర్కే సినీ మాక్స్ లో గాంధీ సినిమా చూసేందుకు భారతీయ విద్యా భవన్‌కు చెందిన విద్యార్తులు వచ్చారు. 

అయితే ఆర్కే సినీ మాక్స్‌లో ఎస్కలేటర్‌ స్పీడ్‌గా కదలడంతో.. కొందరు విద్యార్థులు కిందపడ్డారు. ఈ ఘటనలో తొమ్మిది మంది విద్యార్థులకు గాయాలు కాగా.. వెంటనే వారిని అపోలో ఆస్పత్రికి తరలించారు. గాయపడినవారిలో ఏడుగురు విద్యార్థులుకు స్వల్ప గాయాలు కాగా.. మరో ఇద్దరికి తీవ్ర  గాయాలు అయినట్టుగా సమాచారం. అయితే విద్యార్థులకు ఎలాంటి ప్రమాదం లేదని అపోలో వైద్యులు తెలిపారు. 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

Kavitha: ఇక స‌మ‌ర‌మే.. ఎన్నిక‌ల బ‌రిలోకి దిగుతోన్న క‌విత‌. తండ్రి కారు అయితే కూతురు..?
Money Earning Tips : మేడారం జాతరలో పెట్టుబడి లేకుండానే లక్షలు సంపాదించండి.. టాప్ 5 బిజినెస్ చిట్కాలు