telangana Assembly budget session : ఖరారైన అజెండా.. ఈ నెల 15న ద్రవ్యవినిమయ బిల్లు

Siva Kodati |  
Published : Mar 09, 2022, 04:30 PM ISTUpdated : Mar 09, 2022, 04:32 PM IST
telangana Assembly budget session : ఖరారైన అజెండా.. ఈ నెల 15న ద్రవ్యవినిమయ బిల్లు

సారాంశం

తెలంగాణ బడ్జెట్ సమావేశాలకు సంబంధించి సభ నిర్వహణపై బీఏసీ సమావేశమైంది. ఈ సందర్భంగా పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. దీని ప్రకారం మార్చి 15న ద్రవ్య వినిమియ బిల్లును ప్రవేశపెట్టి చర్చించనున్నారు.   

తెలంగాణ అసెంబ్లీ (telangana Assembly budget session) ఎజెండా ఖరారైంది. బీఏసీ సమావేశంలో సభ నిర్వహణపై నిర్ణయం తీసుకున్నారు. రేపటి నుంచి సభలో క్వశ్చన్ అవర్, జీరో అవర్‌ను నిర్వహించనున్నారు. ఇక ఆ తర్వాతే పద్దులపై చర్చ జరిగేందుకు బీఏసీ సమావేశంలో అంగీకరించారు. ఈ నెల 15న ద్రవ్య వినిమయ బిల్లుపై చర్చ జరిపి ఆమోదించనున్నారు. 

అంతకుముందు త్వరలోనే  రాష్ట్రంలోని 80,039 ప్రభుత్వ ఉద్యోగ పోస్టులను భర్తీ చేస్తామని ఇవాళ ఉదయం అసెంబ్లీలో సీఎం కేసీఆర్ ప్రకటించారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైన నాటి నుండి  ఇప్పటి వరకు 1.30 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలను భర్తీ చేశామని సీఎం కేసీఆర్ ప్రకటించారు. రాష్ట్రంలో ప్రభుత్వ ఉద్యోగ ఖాళీలు 91,147 ఉన్నాయని సీఎం చెప్పారు. అయితే ఇందులో కాంట్రాక్టు ఉద్యోగులను క్రమబద్దీకరించగా మిగిలిన 80,039 ఉద్యోగ పోస్టులను భర్తీ చేస్తామని సీఎం కేసీఆర్ ప్రకటించారు.

పోలీస్ శాఖలో 18,334, విద్యాశాఖలో 13,086, వైద్య, ఆరోగ్యశాఖలో 12,755, ఉన్నత విద్యా శాఖలో 7,878, రెవిన్యూ శాఖలో 3,560, బీసీ సంక్షేమ శాఖలో 4,311, గిరిజన సంక్షేమ శాఖలో 2,399, సాగునీటి శాఖలో 2,692  పోస్టులను భర్తీ చేస్తామని కేసీఆర్ ప్రకటించారు. ఇవాళ్టి నుండే ఉద్యోగ నియామకాలకు సంబంధించి నోటిఫికేషన్  జారీ చేస్తామని కేసీఆర్ ప్రకటించారు. 

మైనారిటీ శాఖలో 1,825,అటవీశాఖలో 1598,పంచాయితీరాజ్ శాఖలో 1455,కార్మిక శాఖలో 1221,ఫైనాన్స్ శాఖలో 1146, మున్సిఫల్ శాఖలో 859, వ్యవసాయ శాఖలో 801, రవాణ శాఖలో 563 పోస్టులు ఖాళీగా ఉన్నాయని సీఎం చెప్పారు.న్యాయ శాఖలో 386,సాధారణ పరిపాలన శాఖలో 343,పరిశ్రమల శాఖలో 233, పర్యాటక శాఖలో 184, సచివాలయం, హెచ్ఓడీ, వర్శిటీల్లో 8,147 ఖాళీలున్నాయని సీఎం వివరించారు. 
ఇక గ్రూప్- 1లో 503,గ్రూపు 2లో 582, గ్రూప్ 3లో1373, గ్రూప్ 4 లో9168, జిల్లా స్ధాయి లో 39,829,జోనల్ స్థాయిలో 18866,మల్టీజోన్ లో13170, అదర్ కేటగిరిలో వర్సిటీలలో 8174 భర్తీ చేస్తామని కేసీఆర్ ప్రకటించారు. 

ప్రతి ఏటా ఉద్యోగ ఖాళీలను గుర్తించి ఉద్యోగ నియమాకాలను చేపడుతామని కేసీఆర్ చెప్పారు.  పోలీస్ శాఖ మినహాయించి అన్ని ఉద్యోగాలకు అభ్యర్ధుల వయో పరిమితిని పదేళ్లకు పెంచుతూ నిర్ణయం తీసుకొన్నామని కేసీఆర్ తెలిపారు. ఓసీలకు 44 ఏళ్లు ,ఎస్సీ, ఎస్టీ, బీసీలకు 49 ఏళ్లు, దివ్యాంగులకు 54 ఏళ్లకు వయో పరిమితి పెంచుతున్నట్టుగా కేసీఆర్ తెలిపారు.

తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు అనేది  దేశ చరిత్రలో ప్రత్యేక ఘట్టమన్నారు. Hyderabad తొలుత ఒక దేశంగా, ఆ తర్వాత ప్రత్యేక రాష్ట్రంగా ఉందన్నారు. ఆ తర్వాత భాషా ప్రయుక్త రాష్ట్రాల ఏర్పాటులో తెలంగాణ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అంతర్భాగంగా ఉందన్నారు.  ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటు డిమాండ్ కోసం 1969లో జరిగిన ఉద్యమంలో తాను 9వ తరగతి విద్యార్ధిగా పోలీసుల లాఠీ దెబ్బలు తిన్నానని కేసీఆర్ చెప్పారు. ఇంజనీరింగ్ విద్యార్ధిగా మీరు కూడా ఈ పోరాటంలో పాల్గొన్నారని కేసీఆర్ ఈ సందర్భంగా గుర్తు చేశారు. ఉమ్మడి రాష్ట్రంలో వివక్ష, అన్యాయాలతో తెలంగాణ నలిగిపోయిందన్నారు. 
 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

కేసీఆర్ చంద్రబాబు పై కీలక వ్యాఖ్యలు: Palamuru Lift Irrigation Project | Asianet News Telugu
Top 10 Law Colleges in India : ఈ హైదరాబాద్ లా కాలేజీలో చదివితే.. సుప్రీం, హైకోర్టుల్లో లాయర్ పక్కా