ఏపీ, తెలంగాణ మధ్య మరో వివాదం: శ్రీశైలంలో విద్యుత్ ఉత్పత్తిపై ఏపీ అభ్యంతరం

By narsimha lode  |  First Published Jun 30, 2021, 10:17 AM IST

ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల మధ్య జలవివాదం ముగియకముందే జలవిద్యుత్ ఉత్పత్తిపై ఫిర్యాదులు చోటు చేసుకొన్నాయి.


హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల మధ్య జలవివాదం ముగియకముందే జలవిద్యుత్ ఉత్పత్తిపై ఫిర్యాదులు చోటు చేసుకొన్నాయి.కృఫ్ణా నదిపై రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు నిర్మాణం, ఆర్డీఎస్ కుడికాలువ నిర్మాణాలను తెలంగాణ ప్రభుత్వం తీవ్రంగా వ్యతిరేకిస్తోంది.ఈ విషయమై  కేంద్ర జల్‌శక్తి మంత్రికి  తెలంగాణ సీఎం కేసీఆర్ ఫిర్యాదు చేశారు.ఇదిలా ఉంటే శ్రీశైలం ప్రాజెక్టులోని ఎడమగట్టు జలవిద్యుత్ ఉత్పత్తి కేంద్రంలో తెలంగాణ ప్రభుత్వం విద్యుత్ ను ఉత్పత్తి చేస్తోంది. అయితే  ఎడమగట్టు జల విద్యుత్ కేంద్రంలో విద్యుత్ ఉత్పత్తిపై  ఏపీ ప్రభుత్వం కేఆర్ఎంబీకి ఫిర్యాదు చేసింది. 

ALSO READ: శ్రీశైలం ఎడమ జల విద్యుత్ ఉత్పత్తి కేంద్రానికి నీటిని నిలిపివేయాలి: కేఆర్ఎంబీకి ఏపీ ఫిర్యాదు...

Latest Videos

శ్రీశైలం ఎడమగట్టు విద్యుత్ కేంద్రంలో విద్యుత్ ను ఉత్పత్తి చేయాలని  తెలంగాణ ప్రభుత్వం సోమవారం నాడు ఆదేశాలు జారీ చేసింది.దీంతో ఈ విషయమై ఏపీ ప్రభుత్వం కేఆర్ఎంబీకి లేఖ రాసింది. శ్రీశైలం ఎడమగట్టు విద్యుత్ కేంద్రంలో  జల విద్యుత్ ఉత్పత్తిని వెంటనే నిలిపివేసేలా ఆదేశాలు ఇవ్వాలని ఏపీ ప్రభుత్వం ఆ లేఖలో కేఆర్‌ఎంబీని కోరింది.అయితే శ్రీశైలం ఎడమగట్టు విద్యుత్ కేంద్రంలో విద్యుత్ ఉత్పత్తిని నిలిపివేయాలని కేఆర్ఎంబీ తెలంగాణను ఆదేశించింది.

రాష్ట్రంలో విద్యుత్ అవసరాలను తీర్చేందుకు గాను పూర్తిస్థాయిలో జలవిద్యుత్  ఉత్పత్తిని చేయాలని సీఎం కేసీఆర్ ఇటీవలనే అధికారులను ఆదేశించారు.తెలంగాణ రాష్ట్రానికి విద్యుత్ అవసరం ఎక్కువగా ఉంది. పూర్తిస్థాయిలో తెలంగాణ ప్రభుత్వం జలవిద్యుత్ ను ఉత్పత్తి చేయడం లేదు.   రాష్ట్ర అవసరాలకు అనుగుణంగా జలవిద్యుత్ ఉత్పత్తిని పెంచాలని జెన్ చైర్మెన్ ఆదేశాలు జారీ చేశారు.

జూరాల ప్రాజెక్టులో 300 మెగావాట్లు, శ్రీశైలంలో 300 మెగావాట్లు, నాగార్జునసాగర్ లో 100 నుండి 200 మెగావాట్ల విద్యుత్ ను ఉత్పత్తి చేస్తున్నారు. లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టులకు  సుమారు 5 వేల మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి చేయాల్సి ఉంది.  1200 మెగావాట్లు కాళేశ్వరం ప్రాజెక్టుకే అవసరం ఉంది.2019-20 లో 4509 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి చేశారు. 2020-21 లో శ్రీశైలం ఎడమ జలవిద్యుత్ కేంద్రంలో కొన్ని యూనిట్లు దెబ్బతిన్నాయి. దీంతో 700 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తికి ఇబ్బందులు నెలకొన్నాయి. 


 

click me!