భార్య, కూమారుడిని హతమార్చి జైలుకు.. బెయిల్ పై వచ్చినా.. ఎవరూ మాట్లాడకపోవడంతో ఆత్మహత్య..

Published : Oct 02, 2023, 11:28 AM IST
భార్య, కూమారుడిని హతమార్చి జైలుకు.. బెయిల్ పై వచ్చినా.. ఎవరూ మాట్లాడకపోవడంతో ఆత్మహత్య..

సారాంశం

భార్య, కుమారుడిని చంపి జైలుకు వెళ్లిన ఓ వ్యక్తి  కొంత కాలం తరువాత బెయిల్ పై బయటకు వచ్చాడు. కానీ స్థానికులు ఎవరూ అతడితో సరిగా మాట్లాడలేదు. ఈ విషయంలో మనస్థాపం చెందిన నిందితుడు ఆత్మహత్యకు పాల్పడ్డాడు.

ఓ వ్యక్తి క్షణికావేశంలో తన భార్య, పిల్లలను హతమార్చాడు. దీంతో పోలీసులు అతడిని అరెస్టు చేసి జైలుకు తరలించారు. కొంత కాలం తరువాత అతడు బెయిల్ పై బయటకు వచ్చాడు. అయితే స్థానికులు అతడితో మాట్లాడటం మానేశారు. దీంతో మనస్థాపం చెంది అతడు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ ఘటన హైదరాబాద్ లో జరిగింది. 

ప్రధాని మోడీ పాలమూరు సభకు బీజేపీ ముఖ్య నేతల డుమ్మా.. కనిపించని సీనియర్ నాయకులు.. కారణం అదేనా ?

వివరాలు ఇలా ఉన్నాయి. అబ్దుల్లాపూర్ మెట్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఇంట్లో 32 ఏళ్ల వై. ధన్ రాజ్ తన భార్య కూతురు, కుమారుడితో కలిసి జీవించేవాడు. అయితే ఏం జరిగిందో ఆ దంపతుల మధ్య మనస్పర్థలు వచ్చాయి. దీంతో వారిద్దరూ తరచూ గొడవ పడేవారు. ఈ క్రమంలో ఆరు నెలల కిందట కూడా భార్యాభర్తలు గొడవ పడ్డారు. దీంతో ధన్ రాజ్ కు కోపం వచ్చి తన భార్యను దారుణంగా హతమార్చాడు.  43 రోజుల చిన్న కుమారుడిని కూడా హత్య చేశాడు.

బెట్టింగ్ కు బానిసై దొంగగా మారిన టెక్కీ.. మొదట మేనత్త ఇంట్లోనే చోరీ చేసి చివరికి..

దీనిని గమనించిన పెద్ద కూతురు పరిగెత్తుకుంటూ వెళ్లి స్థానికులకు సమాచారం ఇచ్చింది. అయితే వారు ఇంటికి చేరుకుని చూడగానే మహిళ, ఆమె బిడ్డ మృతదేహాలు కనిపించాయి. దీంతో నిందితుడిని పట్టుకొని పోలీసులకు అప్పగించారు. అయితే అతడు గత నెలలో బెయిల్ పొంది జ్యుడీషియల్ రిమాండ్ నుంచి బయటకు వచ్చాడు. కానీ స్థానికులు అతడి తో మాట్లాడటం మానేశారు. చీదరింపుతో చూసేవారు. దీంతో అతడు ఎక్కువగా ఇంటికే పరిమితమయ్యారు.

భర్త ఆచూకీ చెప్పాలంటూ పోలీసు స్టేషన్ ఎదుట మహిళ బైఠాయింపు.. అక్కడే ఆత్మహత్యాయత్నం..

ఈ పరిణామాల పట్ల అతడు మనస్థాపానికి గురయ్యాడు. ఆదివారం ఉదయం ఇంట్లో ఎవరూ లేని సమయం చూసి ఆత్మహత్య చేసుకున్నారు. కుటుంబ సభ్యులు బయటి నుంచి తిరిగి వచ్చి చూడగా శవమై కనిపించారు. దీనిపై సమాచారం అందగానే పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం హాస్పిటల్ కు తరలించారు. దీనిపై పోలీసులు కేసు నమోదు చేసుకొని, దర్యాప్తు చేస్తున్నారు. 

PREV
Read more Articles on
click me!

Recommended Stories

డిసెంబ‌ర్ 31న పెగ్గు వేద్దాం అనుకుంటున్నారా.? రూ. 10 వేలు ఫైన్, 6 నెల‌ల జైలు శిక్ష త‌ప్ప‌దు!
హైదరాబాద్‌లో 72 అంత‌స్తుల బిల్డింగ్‌.. ఎక్క‌డ రానుందో తెలుసా.? ఈ ప్రాంతంలో రియ‌ల్ బూమ్ ఖాయం